London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రతి ఒక్కరికి కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం

యువర్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు

విశాలాంధ్ర – ధర్మవరం:: ప్రతి ఒక్కరికి కంటి వెలుగును ప్రసాదించడే మే మా లక్ష్యము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర,కార్యదర్శి ఆర్. జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో ఈనెల ఏడవ తేదీన నిర్వహించబడే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి వైద్య శిబిరం యువర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, నేత్రాలయ ఐ క్లినిక్ వారి సహకారంతో, పుష్పగిరి కంటి ఆసుపత్రి, కడప వారిచే నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా వృద్ధి హోం ఫైనాన్స్ మెయిన్ బజార్, ధర్మవరం వారు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో కంటి శుక్లములు గలవారికి ఉచితముగా పరిచయాలు నిర్వహించి అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ నిబంధనల ప్రకారం ఆపరేషన్లు నిర్వహించబడునని తెలిపారు. క్యాంపు చైర్మన్గా శ్రీకాంత్ రెడ్డి, ఆప్తాలమిక్ అసిస్టెంట్ గా నాగరాజా ఆచారి నిర్వహిస్తారని తెలిపారు. ఈ శిబిరమునకు వచ్చువారు ఆరోగ్యశ్రీ కార్డు, ఈహెచ్ఎస్ కార్డు, బ్యాంకు పాస్బుక్,ఆధార్ కార్డు తో పాటు సెల్ నెంబర్ తో రావాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్ భాషా, గర్రె రమేష్ బాబు, బండ్లపల్లి రంగనాథ్, వైకే శ్రీనివాసులు, బాల మాదిశేషులు తదితర సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img