Friday, May 17, 2024
Friday, May 17, 2024

పకడ్బందీగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ

: జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈవీఎంల, వివి ప్యాట్స్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియను ఇప్పటికే నిర్వహించడం జరిగిందని, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 18 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, అదనంగా మరో బ్యాలెట్ యూనిట్ అవసరమయ్యాయన్నారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే 331 బ్యాలెట్ యూనిట్లను కేటాయించడం జరిగిందని, ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు 16 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి 20 శాతం అదనంగా 329 బ్యాలెట్ యూనిట్లను కేటాయిస్తూ మంగళవారం ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి 660 బ్యాలెట్ యూనిట్లను కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించడం జరిగింది. ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి కావడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, నోడల్ అధికారులు నరసింహారావు, ప్రభాకర్ రావు, వైఎస్ఆర్సిపి ప్రతినిధులు శ్రీనివాసులు, బషీర్ అహ్మద్, టిడిపి ప్రతినిధి చెరుకుతోట పవన్ కుమార్, బీఎస్పీ ప్రతినిధి అంజయ్య, కాంగ్రెస్ ప్రతినిధి షేక్ ఇమామ్ వలి, బిజెపి ప్రతినిధి ఈశ్వర ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి షేక్ మసుద్ వలి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img