విశాలాంధ్ర, సీతానగరం: కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే అనర్ధాలు,దుష్ప్రభావాలు గురించి వివరించి వాటికి దూరంగా ఉండాలని ఎస్సై రాజేష్ పిలుపునిచ్చారు. బుధవారంనాడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాధకద్రవ్యాల నిరోధిక దినం సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యంగా విద్యార్థులు మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని,అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దాలినాయుడు, ఎన్ ఎస్ ఎస్ పి ఓ రామకృష్ణ, కళాశాల అధ్యాపకులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది సుజాత,పద్మ,బ్రహ్మాజీ,రమేష్,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు