Monday, May 20, 2024
Monday, May 20, 2024

మానవత్వం పునాదులపై వెలిసినదే రెడ్ క్రాస్ సంస్థ

ధర్మవరం టౌన్ రెడ్ క్రాస్ చైర్మన్. డాక్టర్. నరసింహులు
విశాలాంధ్ర : ధర్మవరం:: మానవత్వం పునాదులపై వెలిసినదే రెడ్ క్రాస్ సంస్థ అని ధర్మవరం టౌన్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వారు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మనం దానం చేసే రక్తపు బొట్టు మరొకరి జీవితాన్ని నిలబడుతుందని, రక్తదానం చేయండి, చేయించండి అని తెలిపారు. రక్త దానమును విలువ కట్టలేమని, రాజకీయాలకు, కులాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. తల సేమియా బాధితులకు అండగా ఉంటూ రక్త దానమును ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకు రక్తదాతల యొక్క పాత్ర కీలకమైనదని తెలిపారు. రక్త దాతలు ఇచ్చే చిన్న రక్తపు బొట్టు, నిండు ప్రాణమును కాపాడుతుందని తెలిపారు. ఆత్మీయతతో బ్రతుకు భరోసా కలిగిస్తుందని, యుద్ధాలు విపత్తులు, ప్రమాదాల గాయాలనుండి మనసుకు శాంతము చేకూర్చు సేవకు మనమందరం అభివాదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రాణ దీపాన్ని వెలిగించే స్నేహ నిధి ఈ రెడ్ క్రాస్ సంస్థ అని, రక్తదాతల సహాయ సహకారాలతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు ఉందని తెలిపారు. నిర్భాగ్యుల పాలిట వరంగా రెడ్ క్రాస్ సంస్థ మారిందని, మాధవుడే మానవతా రూపమై పుట్టిన రెడ్ క్రాస్ సంస్థకు ప్రతి ఒక్కరు వందనాన్ని తెలియజేయాలని తెలిపారు. వరములు ఇచ్చు దేవుడు పంపిన ఆత్మీయ నేస్తం, అమ్మ తనపూ మరో రూపులే, ప్రేమా అమృత ధారంగా ఆవిర్భవించింది రెడ్ క్రాస్ సంస్థ అని తెలిపారు. ధర్మవరం పట్టణంలో ఇప్పటికే రెడ్ క్రాస్ సంస్థ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, పలుమార్లు రక్తదాన శిబిరములు నిర్వహించడం జరిగిందని, యువతి యువకులకు రక్తదానం యొక్క ప్రాధాన్యత, వాటి ఆవశ్యకత, రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలను కూడా అవగాహన సదస్సు ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img