London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

వికసిత్ ఆంధ్ర 2047 కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి

జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : వికసిత్ ఆంధ్ర 2047 కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో వికసిత్ ఆంధ్ర @ 2047పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులంతా వారి శాఖల పరిధిలో మూడు స్థాయిల్లో ప్రణాళికలు తయారు చేయాలని, అందులో 100 రోజుల కార్యచరణ ప్రణాళిక, ఒక సంవత్సరం ప్రణాళిక, వికసిత్ ఆంధ్ర 2047 కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఈరోజులోపు ఒక సంవత్సరం ప్రణాళికను అన్ని శాఖల అధికారులు అందించాలన్నారు. మూడు రకాల ప్రణాళికలు తయారు చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని ఆదేశించారు. వికసిత్ ఆంధ్ర 2047కు సంబంధించి ఐదు మంది జిల్లా అధికారులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి వెళ్లి రావడం జరిగిందని, వారిచ్చే సూచనలను పాటించి జిల్లాలో వికసిత్ ఆంధ్ర @ 2047 కార్యచరణ ప్రణాళికను తయారు చేయాలన్నారు. 124 శాఖల జిల్లా అధికారులంతా వారికి సంబంధించి కేటాయించిన జాబ్ రోల్ ను అందరూ చదవాలని, అధికారులు వారు ఏమేం చేయాలనే దానిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా అధికారులు వారి కార్యాలయాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని, ప్రతిరోజు పని చేసేందుకు వచ్చే సమయంలో ఉత్తేజకరంగా రావాలని, మనకున్న స్థాయి నుంచి ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుందని, మనందరి చేతుల్లో ఎంతో బాధ్యత ఉందని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అందరూ వారి పనిని స్వతంత్రంగా చేయాలని, వికసిత్ ఆంధ్ర @ 2047 కి సంబంధించి జిల్లాలో ఆయా శాఖల పరిధిలో ఏం చేయొచ్చు అనే దానిపై వెంటనే సన్నద్ధత పూర్తి చేయాలన్నారు. వచ్చే 24 గంటల్లోగా జిల్లా అధికారులంతా ఈ ఆఫీస్ లోనే ఫైల్స్ పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐ ఎస్ ఓ 9001:2015 సర్టిఫికేట్ ను చేయించేందుకు ఈనెలాఖరువరకు సమయం ఇవ్వడం జరిగిందని, అంతలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్టిఫికెట్ చేయించాలని ఆదేశించారు. జిల్లా అధికారులంతా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో ఉండాలన్నారు. వచ్చే మంగళవారం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అధికారులు సిద్ధం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డీపీఓ ప్రభాకర్ రావు, డిటిసి వీర్రాజు, సిపిఓ అశోక్ కుమార్, డీఆర్డీఏ పిడి ఓబులమ్మ, డిసీఓ మురళీకృష్ణ, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, పీఆర్ ఎస్ఈ ప్రసాద్, ఆర్.అండ్.బి ఎస్ఈ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, హార్టికల్చర్ డిడి నరసింహారావు, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డిఈఓ వరలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, డిఎస్ఓ శోభారాణి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆదోని, ఎస్డిసి ఆనంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img