Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రాయలసీమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి..

రాయలసీమ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. పిక్కిలి మహేష్
విశాలాంధ్ర- ధర్మవరం :
రాయలసీమలోని సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని రాయలసీమ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కిలి మహేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలో యువతను చైతన్యం చేస్తూ సంతకాల సేకరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు ప్రజలతో సంతకాల సేకరణ చేస్తున్నామని,తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కం బ్యారేజ్ నిర్మించాలని అప్పర్ భద్ర ప్రాజెక్టును నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గూర్చి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాలుగా రాయలసీమ హక్కుల కోసం రాయలసీమ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేపట్టే ప్రతి కార్యక్రమానికి మా మద్దతు ఉంటుందని తెలిపారు. రాయలసీమ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే 2024 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img