Friday, December 13, 2024
Homeఆంధ్రప్రదేశ్ల్యాబ్ టెక్నీషియన్స్ కు అసోసియేషన్ ఆర్థిక సహాయం

ల్యాబ్ టెక్నీషియన్స్ కు అసోసియేషన్ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర -ధర్మవరం:: రెండు రోజుల క్రిందట ధర్మారం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రదీప్, ఇతీష్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సమాచారంతో ధర్మవరం మెడికల్ ల్యాబ్స్ టెక్నీషియన్ అసోసియేషన్ వారు వారి ఇంటికి స్వయంగా వెళ్లి 22 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రకాష్, కరుణాకర్ ,అంజన్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు