అనంతపురం: భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ మంగళవారం అనంతపురంలో 80 అడుగుల రోడ్, సూర్యనగర్‌లో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. సూపర్‌స్టార్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ వివిధ కలెక్షన్ల నుండి విస్తృతమైన డిజైన్లు ప్రదర్శిస్తున్నారు.కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ‘‘కళ్యాణ్ జ్యువెలర్స్‌తో నాకున్న సుదీర్ఘ అనుబంధం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ‘ట్రస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్’ అనే కంపెనీ లక్ష్యం కు అనుగుణంగా వారు చూపుతున్న నిబద్ధత పరిశ్రమలో వారిని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ రోజు మీ అందరినీ కలుసుకునే అవకాశం లభించినందుకు నేను థ్రిల్‌గా ఉన్నాను’’ అని అన్నారు.