London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త వాణిజ్య వాహనం ఫ్లీట్‌ వెర్స్‌

ముంబయి : భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన కమర్షియల్‌ వెహికల్స్‌ కోసం సమగ్రమైన, వినూత్నమైన డిజిటల్‌ మార్కెట్‌ప్లేస్‌ అయిన టాటా మోటార్స్‌ ఫ్లీట్‌ వెర్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లాట్‌ఫారమ్‌ కొత్త వాహన ఆవిష్కరణ, కాన్ఫిగరేషన్‌, అక్విజిషేన్‌, ఫైనాన్సింగ్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది. అన్ని వాణిజ్య వాహనాల అవసరాలకు ఫ్లీట్‌ వెర్స్‌ను వన్‌స్టాప్‌ డిజిటల్‌ డెస్టినేషన్‌గా మారుస్తూ అదనపు సేవలు, ఫీచర్ల శ్రేణిని చేర్చడానికి భవిష్యత్‌లో ప్రూఫ్‌ చేయబడిరది. ఫ్లీట్‌ వెర్స్‌ ఫ్లాట్‌ఫారమ్‌ను ప్రారంభిస్తూ, టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ డిజిటల్‌ బిజినెస్‌ హెడ్‌ భరత్‌ భూషణ్‌ మాట్లాడుతూ, ఫ్లీట్‌ వెర్స్‌ను ప్రారంభించడం ద్వారా కస్టమర్లకు అన్నింటినీ కలుపుకొని డిజిటల్‌ను అందించడం ద్వారా తాము వాణిజ్య వాహన పరిశ్రమలో కొత్త బెచ్‌మార్క్‌ను నెలకొల్పుతున్నామని అన్నారు. వాణిజ్య వాహన యాజమాన్య అనుభవాన్ని క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది వేగవంతమైనది, తెలివైనది, సురక్షితవమైనది, విశ్వసనీయమైనదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img