హైదరాబాద్: లోకా లోక తాజాగా అధికారికంగా అంతర్జాతీయ ఆల్కోబెవ్ మార్కెట్లోకి ప్రవేశించింది. తమ కార్యకలాపాల ప్రారంభ సూచికగా టేకిలా బ్లాంకో, రెపోసాడోను విడుదల చేసింది. లోకా లోకకు ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు రానా దగ్గుబాటి, ప్రఖ్యాత సంగీతకారుడు, స్వరకర్త అనిరుధ్ రవిచందర్, అనుభవజ్ఞుడైన వ్యవస్థాపకుడు, ఐరన్‌హిల్ ఇండియా మేనేజింగ్ పార్టనర్ హర్ష వడ్లమూడి మద్దతునిస్తున్నారు.గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా చేసుకున్న బ్రాండ్ మొదట యుఎస్‌లో విడుదల చేయబడుతుంది. తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు. జాలిస్కో డిస్టిలరీ ప్రొడక్షన్ హెడ్ లియోన్ బాన్యులోస్ రామిరెజ్ మాట్లాడుతూ, మెక్సికన్ టేకిలా సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తుండటం సంతోషంగా వుందన్నారు.