ముంబjయి: బీఎండబ్ల్యు ఇండియా ఆల్-న్యూ బీఎండబ్ల్యు 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్‌ను విడుదల చేసింది. ఇండియాలోని బీఎండబ్ల్యు డీలర్‌షిప్‌లలో, బీఎండబ్ల్యు.ఇన్‌లో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2024 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ బీఎండబ్ల్యు 5 సిరీస్ బీఎండబ్ల్యు బ్రాండ్ హృదయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఇది ప్రతిష్టాత్మక ఎగ్జిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్లో కొన్నేళ్లుగా మార్కెట్లో లీడర్‌గా ఉంది. మొదటి తరం 1972లో ప్రారంభించినప్పటి నుంచి 5 సిరీస్‌లు దాదాపు 10 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన బిజినెస్ సెడాన్ ఎనిమిదవ జనరేషన్ డిజిటల్ ఇన్నోవేషన్స్ సంపదను కలిగి ఉండటంతో గతంలో కన్నా ఇది మరింత డైనమిక్‌గా ఉందని బీఎండబ్ల్యు సీఈఓ, ప్రెసిడెంట్ విక్రమ్ పవాప్ా తెలిపారు. ఆల్-న్యూ బీఎండబ్ల్యు 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ ప్రత్యేకంగా పెట్రోల్ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధర: 72,90.000