హైదరాబాద్: మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) రాష్ట్రవ్యాప్తంగా 12 అదనపు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్లను ఆటోమేట్ చేయడానికి ఉత్తరప్రదేశ్ రవాణా శాఖతో ఒప్పందం కుదర్చుకుంది. డిసెంబరు 2023లో సంతకం చేసిన మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే ఐదు టెస్ట్ ట్రాక్లు ఆటోమేట్ చేశారు. తాజాగా మరో 12 ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు. యూపీ మంత్రి దయాశంకర్ సింగ్ మారుతీ సుజుకీ కృషిని అభినందించారు. కంపెనీ కార్పొరేట్ వ్యవహారల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి మాట్లాడుతూ, ఈ ముఖ్యమైన రహదారి భద్రతా ప్రాజెక్టును కంపెనీకి అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.