హైదరాబాద్ : అపోలో ఫెర్టిలిటీ ‘స్కోర్ ఓవర్ ఇన్ఫెర్టిలిటీ’ ప్రోగ్రామ్ ద్వారా వంధత్వ సమస్యను అధిగమించడంలో జంటలకు సాయపడుతున్నట్లు అపోలో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ డాక్టర్ కల్నల్ సందీప్ కరుణాకరన్ తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా స్కోర్ ఓవర్ ఇన్ఫెర్టిలిటీ స్క్రీనింగ్ ప్యాకేజీ ద్వారా యువ జంటలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ముందుగా అంచనా వేయడానికి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు వేల జంటలకు సహాయం చేసినట్లు తెలిపారు. ఈ సమగ్ర ప్యాకేజీలో ఏఎంహెచ్, సెమెన్ స్క్రీనింగ్, యూఎస్జీ, థైరాయిడ్ స్క్రీనింగ్ వంటి పరీక్షల ద్వారా దంపతుల ఆరోగ్యాన్ని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మా నిపుణుల బృందం రోగులకు ప్రేమతో కూడిన సేవలు అందిస్తున్నారన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా జంటలకు తమ ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకునే శక్తిని ఇవ్వడం, తల్లిదండ్రుల కలను సాకారం చేయడం మా లక్ష్యమన్నారు.