బెంగుళూరు : ఓలా ఎలెక్ట్రిక్ 15,000 రూపాయల విలువ చేసే అద్బుతమైన ఆఫర్లను దాని ఎస్ 1 పోర్ట్‌ఫోలియోలో ‘ఓలా ఎలెక్ట్రిక్ రష్’ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రకటించింది. ఇది జూన్ 28 వరకు పని చేస్తుంది. ఇది ఎస్ 1 ఎక్స్G 5,000 రూపాయల తక్షణ తగ్గింపుతో, ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్ మీద 2,500 రూపాయల తగ్గింపుతో వస్తుంది. వినియోగదారులు 10,000 రూపాయల అదనపు లాభాలతో పాటు ఎస్ 1 ఎక్స్G మీద 5,000 రూపాయల అదనపు లాభాన్ని పొందవచ్చు. ఎస్ 1 పోర్ట్‌ఫోలియో మీద ఎంచుకోబడ్డ క్రెడిట్ ఈఎంఐల మీద సుమారు 5000 రూపాయల క్యాష్ బ్యాక్‌ని కూడా పొందవచ్చు. ఓలా ఎలెక్ట్రిక్ విభిన్నశ్రేణి అవసరాలతో వినియోగదారులకు అందించే ఆకర్షణీయమైన ధరల పాయింట్లలో ఆరు ఆఫర్లతో విస్తృతమైన ఎస్1 పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. మాస్ మార్కెట్ విభాగంలో దాని రాకని ఎస్ 1 ఎక్స్ పోర్ట్‌ఫోలియోతో ఈ మధ్యే మొదలుపెట్టింది. ఇది మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్స్ లో (2 కేడబ్ల్యుహెచ్, 3 కేడబ్ల్యుహెచ్, 4 కేడబ్ల్యుహెచ్) అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్స్ ధర 74,999 రూపాయలు, 84,999 రూపాయలు, 99,999 రూపాయలుగా ఉంటాయి. అదనంగా వారి ప్రీమియం ఆఫరింగ్స్లో ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ఎక్స్ G ఉంటాయి. వాటి ధర క్రమంగా 1,29,999 రూపాయలు,1,04,999 రూపాయలు, 89,999 రూపాయలుగా ఉంటుంది.