ముంబయి: ఎఫ్డీలపై బ్యాంకింగ్ రంగంలోనే అత్యుత్తమైన వాటిలో ఒకటిగా ఎంచతగ్గ వడ్డీ రేటును అందిస్తున్నట్లు దిగ్గజ యూనివర్సల్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ ప్రకటించింది. 500 రోజుల వ్యవధి ఫిక్సిడ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.35 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు తెలిపింది. ఇదే వ్యవధి గల ఎఫ్డీలపై సీనియర్యేతరులకు 7.85 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే 5 ఏళ్ల కాలవ్యవధి గల ట్యాక్స్ సేవర్ ఫిక్సిడ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ రేటు కూడా బ్యాంకు అందిస్తోంది. ఈ ట్యాక్స్ సేవర్ ఎఫ్డీలపై ఇతరులకు 7% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎఫ్డీలపై పరిశ్రమలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటైన వడ్డీ రేటు ఇది. అలాగే, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్‌పై బ్యాంకు 7% వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.