న్యూఢల్లీి: స్వదేశీ సాంకేతికత బ్రాండ్ అర్బన్ తమ వైబ్ సిరీస్ లైనప్‌లో మూడు కొత్త అత్యాధునిక వైర్లెస్ ఓపెన్-ఇయర్ టిడబ్ల్యుఎస్ ఇయర్పాడ్-అర్బన్ వైబ్ క్లిప్, అర్బన్ వైబ్ లూప్ అండ్ అర్బన్ వైబ్ 2-లను ఆవిష్కరించింది. అర్బన్ వైబ్ సిరీస్ చెవికి అనుకూలంగా ఉండేలా రూపొందింది. సుదీర్ఘమైన వినియోగం వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. వీటిని రన్నింగ్, జిమ్, హైకింగ్, సైక్లింగ్ లేదా వీధుల్లో నడవడం వంటి సమయంలో సులభంగా ఉపయోగించవచ్చు. అర్బన్ సహ-వ్యవస్థాపకుడు ఆశిష్ కుంభట్ మాట్లాడుతూ అర్బన్ లక్ష్యం ఎల్లప్పుడూ ప్రాక్టికాలిటీతో ఆవిష్కరణలను మిళితం చేయడం, తమ వినియోగదారులకు గొప్ప సాంకేతిక అనుభవాలను అందించడమేనని అన్నారు. వైబ్ క్లిప్ వినియోగదారులకు సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని నిశితంగా రూపొందింది. సూపర్ హెచ్డీ, 3డీ పనోరమిక్ సరౌండ్ సౌండ్, స్మార్ట్ ఏఐ సౌండ్ యాంప్లిఫైయర్‌తో పూర్తి ఓపెన్-ఇయర్ టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌గా వస్తుంది. ధర రూ. 7,999 కాగా, బ్రాండ్ వెబ్సైట్, ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్‌లు, రిటైల్ అవుట్లెట్లలో ప్రత్యేకంగా రూ. 1,999 ప్రారంభ ఆఫర్ ధరతో లభిస్తుంది.