London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఎన్‌హెచ్‌సీఎక్స్‌ వేదికలో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తొలి హెల్త్‌ క్లెయిమ్‌ ప్రక్రియ

ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ రంగ సాధారణ బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, నేషనల్‌ హెల్త్‌ క్లెయిమ్స్‌ ఎక్ఛేంజ్‌ ప్లాట్‌ఫారమ్‌ (ఎన్‌హెచ్‌సీఎక్స్‌) ద్వారా తన మొట్టమొదటి హెల్త్‌ క్లెయిమ్‌ను విజయవంతంగా ప్రాసెస్‌ చేసింది. ఈ సంచలనాత్మక సాధన గణనీయమైన పురోగతిని సూచిస్తుండగా, ఇది ఆరోగ్య క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు, పరిపాలనా సామర్థ్యాలను మెరుగుపరచడానికి, సాంకేతికతతో నడిచే వ్యవస్థను రూపొందించడం ద్వారా వినియోగదారుని అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు, ఆరోగ్య బీమా మొత్తం ప్రక్రియ మరింత సరళంగా, పారదర్శకంగా జరుగుతుందని నిర్ధారించేందుకు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ వివిధ వాటాదారులను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తోంది. నేషనల్‌ హెల్త్‌ అథారిటీ అభివృద్ధి చేసిన నేషనల్‌ హెల్త్‌ క్లెయిమ్స్‌ ఎక్ఛేంజ్‌ ప్లాట్‌ఫారమ్‌ అనేది ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల డేటా సురక్షితమైన, సమర్థవంతమైన మార్పిడిని అందించే సింగిల్‌ విండో ఇంటర్‌ఫేస్‌. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో సమర్థత, పారదర్శకత కోసం కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశ ఆరోగ్య బీమా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు వేదికను అందిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img