విశాలాంధ్ర/హైదరాబాద్ : మోటిసన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్, 28 అక్టోబర్ 2024న జరిగిన బోర్డు మీటింగ్‌లో, సెప్టెంబర్ 30, 2024తో ముగిసిన త్రైమాసికం అర్ధ సంవత్సరానికి ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాలను ఆమోదించిందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.30 సెప్టెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో (స్టాండలోన్), కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 10934.44 లక్షలు, 21 శాతం పెరుగుదల అన్నారు. కంపెనీ ఈక్విటీ షేర్లను 1:10 నిష్పత్తిలో సబ్-డివిజన్/విభజన ప్రతిపాదనను బోర్డు ఆమోదించినట్లు ఇటీవల కంపెనీ ప్రకటించిందన్నారు.అంటే 1 ఈక్విటీ షేర్లను 10కి విభజించడం, అసోసియేషన్ ఆఫ్ మెమోరాండం యొక్క క్యాపిటల్ క్లాజ్‌లో మార్పు పై నిర్ణయం తర్వాత కంపెనీ, నవంబర్ 09, 2024 విభజనకు రికార్డ్ డేట్‌గా సెట్ చేయబడిరదన్నారు. ఈ బీ ఐ టి డి ఎ రూ. 1762.51 లక్షలు (క్యూ2ఎఫ్ వై5), 34% సంవత్సరం వృద్ధి అయ్యిందన్నారు.