న్యూదిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ తాజాగా రెండు మంచి ఉత్పత్తులని గ్లోబల్‌గా లాంచ్ చేసింది. దీని ఫ్లాగ్ షిప్ జిటి సిరీస్‌కి, ఏఐ వంటి విభాగానికి రియల్ మీ జిటి 6, ఏఐ ఫ్లాగ్షిప్ కిల్లర్, రియల్మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో అనేవి కొత్త జోడిరపులు. రెండు పరికరాలు ఎన్నడూ చూడని ఫీచర్లతో, తెలివైన డిజైన్‌తో ఉంటాయి. ఇవి వినియోగదారుని అనుభవాన్ని క్రమంగా మెరుగుపరచడానికి సెట్ చేయబడ్డాయి. దాన్ని విడుదల చేసినప్పటి నుంచి రియల్మీ జిటి సిరీస్ అనేది కటింగ్ ఎడ్జ్ ఫ్లాగ్షిప్ టెక్నాలజీ ఆవిష్కరణ, ఇది రియల్మీ టెక్నాలజికల్ మెరుగుదలకి విశ్రాంతి లేని కృషిని అందిస్తుంది. రియల్మీ జిటి 6, రియల్మీ బడ్స్ ఎయిర్6 ప్రోలను వరుసగా రూ.35,999, రూ. 4199 నుండి ప్రారంభమవుతాయి. రియల్మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో మొదటి అమ్మకం జూన్ 27 మధ్యాహ్నం 12 నుంచి రియల్మీ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. రియల్మీ జిటి 6 అనేది రెండు ఆకర్షణీయమైన రంగులలో అనగా ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్‌లో లభిస్తుంది.