Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

సీపీఐ అభ్యర్థి మురళిని గెలిపించుకుందాం

తిరుపతిలో ఇండియా కూటమి విస్తృత ప్రచారం
విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి పవిత్రతను కాపాడాలంటే, అవినీతి, దౌర్జన్యం, భూకబ్జాలు లేని సుందర తిరుపతి నిర్మాణం జరగాలంటే సీపీఐ అభ్యర్థి పి.మురళిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌ పిలుపు నిచ్చారు. ఇండియా కూటమి తరపున సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు బలపరిచిన సీపీఐ అభ్యర్థి మురళి గెలుపు కోసం ఆదివారం ప్రచార దళాలుగా ఏర్పడి కొర్లగుంట ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరినాథ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ తిరుపతి నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన పన్నులతో పాటు ప్రత్యేక పన్నులను ప్రజలు చెల్లించాల్సి వస్తుందని విమర్శించారు. కార్పొరేటర్‌ పన్ను, ఎమ్మెల్యే పన్ను, మేయర్‌ పన్ను పేరుతో ఇప్పటికే దందాలు కొనసాగుతున్నాయన్నారు. ఆర్టీసీ బస్‌స్టాండ్‌ వద్ద ఆటో నడుపుకోవాలన్నా, తోపుడు బండి పెట్టుకోవాలన్న రోజువారీ లంచాలు చెల్లిం చాల్సిన పరిస్థితి ఉందని, మునిసిపల్‌ అధికారులకు, పోలీసులకు చెప్పినా తామేమీ చేయలేమంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్మికులకు, స్థానిక ప్రజలకు భరోసా కావాలన్నా, తిరుపతి అభివృద్ధి చెందాలన్నా, యాత్రికులకు రక్షణ ఉండాలన్న తిరుపతిలో సీపీఐ అభ్యర్థి పి.మురళి గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. కొర్లగుంట ప్రాంతవాసులు ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెంచలయ్య, ఎన్‌.డి.రవి, శ్రీరాములు, ప్రభాకర్‌, శశికుమార్‌, సిహెచ్‌ శివకుమార్‌, వైఎస్‌ మని, రామకృష్ణ, పద్మనాభరెడ్డి, బాబు, సీపీఎం నాయకులు లక్ష్మీ, వేణు, బుజ్జి, సుజాతమ్మ, రుక్కు, గుర్రప్ప, నాగరాజు, లాజరస్‌, మంజుల, హరిత, శీను, ఆర్‌.వి.రమేష్‌, వెంకటేష్‌, సురేష్‌, అల్లాబక్ష్‌, రామచంద్రయ్య, విజయమ్మ, రమణ యాదవ్‌, నాగరాజు, సెంధిల్‌, హరికృష్ణ, ఓం ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img