Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

మణిరత్నంపై కేసు!

హైదరాబాద్‌ : మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రీకరణలో ఓ గుర్రం మరణిం చడంతో తెలంగాణలో పోలీసులు మద్రాస్‌ టాకీస్‌, తెలంగాణకు చెందిన గుర్రపు యజ మాని నిర్వహణకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. పెటా ఇం డియా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు గుర్రం యజ మానిపై పీసీఏ చట్టం, 1960 సెక్షన్‌ 11, 1860 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, సెక్షన్‌ 429 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. మూగ జంతువులపై క్రూరత్వంగా ఉండకూడదని ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ జరగకూడదని, సంబంధిత దోషులకు శిక్ష పడాలని యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అధికారులను కోరింది. అలసిపోయి, డీహైడ్రేడ్‌ అయిన గుర్రాల్ని షూటింగ్‌లో ఉపయోగించడం వల్లే గుర్రం మరణించిందని యజ మాని తెలిపారు. జంతువులను ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో కం ప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ఉపయోగించాలనీ, టెక్నాలజీ అందు బాటులో ఉందని టెలివిజన్‌, డిజిటల్‌ కంటెంట్‌ ప్రొడ్యూసర్లను పెటా కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img