కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు..
విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): బాధ్యతగా అంకితభావంతో విధులు నిర్వహిస్తే అవార్డులో పంట పండుతుందనడానికి నిదర్శనం డుంబ్రిగూడ మండల తహసిల్దార్ అవార్డు అందుకోవడమే అనక తప్పదు. విధి నిర్వహణలో సమయం పాలన పాటిస్తూ, ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తూ, భూ సమస్యలు లేకుండా, వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటూ అంకితభావంతో విధులు నిర్వహించే తహసిల్దార్ త్రివేణి ఈ ఏడాది ఉత్తమ తహసిల్దార్ గా ఎంపిక అవడం పట్ల మండల ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాసేవలో ముందుంటూ ఉత్తమ తహసిల్దార్ గా గుర్తింపు పొందిన డుంబ్రిగూడ తాహసిల్దార్ త్రివేణి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతులు మీదుగా 26వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. మండలంలో చేసిన సేవలను, సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళింది. దీంతో గుర్తించిన అధికారులు ఉత్తమ తాసిల్దార్ గా అవార్డును కలెక్టర్ చేతులు మీదుగా అందించారు. దీంతో ఆమె తోటి ఉద్యోగస్తుల తో పాటు మండల ప్రజలు కూడా అభినందనలు తెలుపుతున్నారు.


