London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఆచరణే తరువాయి

ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా చేసిన నిర్ణయాలు చిత్తశుద్ధితో అమలుచేసినప్పుడే ఆ ప్రభుత్వం, దానికి నాయకత్వంవహించే వారి పట్ల ప్రజలలో విశ్వసనీయత పెరుగుతుంది. లేనిపక్షంలో ప్రజల నిరాదరణకు గురికాకతప్పదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు మూడున్నర గంటలపాటు చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో అనేక కీలకాంశాలపై చర్చించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై మొదటి సమావేశంలోనే దృష్టి సారించారు.
ముఖ్యమంత్రిగా ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు 13వ తేదీన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ వెనువెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మొత్తం అయిదు హామీలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. ఆ అయిదు సంతకాలకు మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పేరు పునరుద్ధరిం చాలని కేబినెట్‌ నిర్ణయించింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయాలనీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపడం హర్షణీయం. పింఛన్ల పెంపు అంశంపైనా మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించారు.
పెన్షన్‌గా ఇచ్చే మొత్తం రూ.3వేలనుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెంచిన పింఛన్లను జులై 1 నుంచి ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. సమావేశం అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడిస్తూ సచివాలయ సిబ్బందే ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపడతారని చెప్పారు. పెన్షన్‌ పెంపు వల్ల నెలకు రూ. 810 కోట్ల భారాన్ని భరిస్తున్నామనీ, పెన్షన్ల పంపిణీకి ఏడాదికి రూ. 33,709 కోట్లు వ్యయమవుతుందని తెలిపారు. కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు కేబినెట్‌ ముందుంచారు. జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. కేటగిరీల వారీగా ఎస్‌జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్‌ 52 పోస్టులు భర్తీచేయనున్నారు. జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 44 నుంచి 47 సంవత్సరాలకు పెంచాలన్న విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాల్సివుంది. లేకుంటే కొద్దిపాటి వయస్సు తేడాతో లక్ష మందికిపైగా అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసే అర్హతను కోల్పోయే ప్రమాదముంది. డీఎస్సీ 2018 నుంచి జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్లుగా ఉంది. రిజర్వేషన్‌ వర్గాలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చివరి దశలో ‘డీఎస్సీ 2018’ని ప్రకటించింది. ఆ సమయంలోనూ అతి తక్కువ పోస్టులతోనే ప్రకటన రావడంతో నిరుద్యోగులు ఉద్యమించారు. ఎన్నికల కోడ్‌తో డీఎస్సీ నియామకపు ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వ హయాంలోని డీఎస్సీ 2018 పోస్టులను భర్తీ చేసింది. గత ప్రభుత్వాల పాత డీఎస్సీలో నిలిచిపోయిన పోస్టుల భర్తీకే జగన్‌ ప్రభుత్వం పరిమిత మైంది. జగన్‌ప్రభుత్వం చివరి దశలో 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ, అది కార్య రూపం దాల్చలేదు. 2018 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఏటా డీఎస్సీ అమలుచేయడంలేదు. ఎన్నికల ముందుగానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాకగాని మొక్కుబడిగా డీఎస్సీ ప్రకటించి చేతులు దులుపుకుంటున్నాయి. డీఎస్సీ ప్రకటన రావడమే గగనంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయడం ద్వారా నిరుద్యోగు లకు ఉపాధి కల్పించడంతోపాటు విద్యాబోధన సక్రమంగా జరిగేలా చూడాలి. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్‌, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. ఆరు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతిభద్రతల అంశంపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆయా శాఖలు శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నాణ్యత కలిగిన విద్యని అందించేలా జాతీయ విద్యా విధానాన్ని అధ్యయనం చేస్తామని మంత్రి చెప్పారు. ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ పరిణామం. ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్లు భయపడిపోయారు. నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన చట్టమే భయంకరమైనదనుకుంటే వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ఇంకా ప్రమాదకరమయినదిగా భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఏ ఒక్కటీ కూడా ఈ చట్టాన్ని అమలు చేయలేదు. అయినా వైసీపీ ప్రభుత్వం ఆ చట్టం అమలుకు పూనుకుంది. ఈ చట్టం వల్ల సన్న, చిన్నకారు రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, న్యాయవ్యవస్థలను అస్తవ్యస్తం చేసే ఈ భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
పేదవాడికి నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించాలని కేబినెట్‌ చేసిన నిర్ణయం ముదావహం. రూ.5కే భోజనం అందించేలా మొదట 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు నెలలో ఒకే రోజు ప్రారంభిస్తామనీ, త్వరలో మరో 20 అన్న క్యాంటీన్లను తెరుస్తామని మంత్రి తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో నిరుపేదలకు అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇచ్చిన హామీల అమలుకు మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవడం ముదావహం. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఒక నిర్ణీత కాలపరిమితితో అమలు చేయడం, రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అధిగమించడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందున్న కర్తవ్యం కావాలి. ఈ నిర్ణయాల అన్నింటి అమలులో ముఖ్యమంత్రి నిశిత పర్యవేక్షణ అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రజలకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img