London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

బుల్డోజర్‌ ప్రజాస్వామ్యం

‘‘ఈ దేశ ప్రజలు ప్రతిపక్షం నుంచి మంచి చర్యలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటుందనీ, ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నాను. ప్రజలకు కావాల్సింది నాటకాలు, కల్లోలాలు కాదు. ప్రజలకు అసలైన సారం కావాలి. నినాదాలు కాదు. దేశానికి మంచి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కావాలి. 18వ లోకసభకు ఎన్నికైన వారు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారన్న విశ్వాసం నాకు ఉంది.’’ 18వ లోకసభ ఎన్నికైన తరవాత పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన మహాజ్ఞాన బోధ ఇది. ఈ మాటలన్నీ వింటే 240 స్థానాల దగ్గరే కుదేలై, ఎన్‌.డి.ఎ. భాగస్వామ్య పక్షాల మీద, ఎన్నికల తరవాత తెలుగు దేశం, జె.డి.(యు) నుంచి అందిన మద్దతు మీద అధికారంలోకి వచ్చిన మోదీ ‘‘సాధు జీవి’’గా మారిపోయారని భావిస్తే అది కేవలం భ్రమే అని తేలిపోవడానికి 24 గంటలు కూడా పట్టలేదు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక విషయంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ ఉన్న కిందటి రెండు లోక్‌సభలలో వ్యవహరించినట్టే బుల్డోజర్‌ రాజకీయాలనే కొనసాగిస్తోంది. సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి అధికారపక్షం అదే అహంకారపూరిత ధోరణినే కొనసాగిస్తోంది. ప్రోటెం స్పీకర్‌ను ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడే పార్లమెంటరీ సంప్రదాయాలకు, ప్రజాస్వామ్య కట్టుబాట్లకు తిలోదకాలు ఇచ్చేసింది. మామూలుగా అందరికన్నా సీనియర్‌ సభ్యుడిని అంటే ఎక్కువ సార్లు ఎన్నికైన సభ్యుడిని ప్రోటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీ. ఆ సందర్భంలో ఆ వ్యక్తి అధికార పక్షం వారా లేక ప్రతిపక్షం వారా అన్న అంశంతో నిమిత్తం లేదు. అందరికన్నా సీనియర్‌ అయితే చాలు. ఈ లెక్కన కేరళ నుంచి ఎనిమిదోసారి ఎన్నికైన కొడికున్నిల్‌ సురేశ్‌ ప్రోటెం స్పీకర్‌గా ఎంపిక కావాల్సింది. కానీ మోదీ నేతృత్వంలోని అధికార పక్షం తమ పార్టీకి చెందిన మహతాబ్‌ ఏడుసార్లే ఎన్నికైనా ఆయనని ప్రోటెం స్పీకర్‌ చేసేసి ఆధిపత్య ధోరణిని ప్రదర్శించింది. స్పీకర్‌ను ఎన్నుకోవలసి వచ్చేటప్పటికి అదే మంకుతనం మరింత తీవ్రంగా కొనసాగించింది. కిందటి లోక్‌సభలో స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లానే ఈ సారి కూడా స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టాలనుకుంది. అధికార పక్షానికి 293 మంది సభ్యుల మద్దతు ఉంది కనక ఒకవేళ స్పీకర్‌ స్థానానికి ఎన్నిక జరిగినా ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. కానీ ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షానికి ఇస్తున్న సంప్రదాయాన్ని అధికార పక్షం బాహాటంగా, నిస్సిగ్గుగా తుంగలో తొక్కింది. డిప్యూటీ స్పీకర్‌ గా ప్రతిపక్ష అభ్యర్థిని ఎన్నుకోవడానికి సహకరిస్తే స్పీకర్‌ స్థానానికి అధికార పక్షం అభ్యర్థిని సమర్థిస్తామని ప్రతిపక్షం స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నా అధికార పక్షం హేతుబద్ధంగా ఆలోచించడానికి తిరస్కరించింది. అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ సింగ్‌, జె.పి.నడ్డాలాంటి వారి మంతనాల పేరుతో తన పంతమే చెల్లించుకోవాలన్న అప్రజాస్వామిక వైఖరి అనుసరించింది.
ఈ నేపథ్యంలో గెలుపోటములతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షం అస్తిత్వాన్ని రుజువు చేసుకోవడానికి సురేశ్‌ను ప్రతిపక్షం స్పీకర్‌ ఎన్నికకు రంగంలోకి దించింది. ఇది అధికార పక్షం దృష్టిలో దాష్టీకం కింద కనిపిస్తోంది. గత లోకసభ అయిదేళ్లు డిప్యూటీ స్పీకర్‌గా ఎవరినీ నియమించకుండానే మోదీ కాలం గడిపేశారు. అలాంటిది ఆయన ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చాలో పాఠాలు చెప్పే దుస్సహసానికి ఒడిగట్టారు. సభలో అధికార పక్షానికి తగినంత మద్దతు ఉంది కనక ఓం బిర్లా ఎన్నికైతే ఆశ్చర్య పోవలసింది ఏమీ లేదు. కిందటి సారి డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు ఏ పక్షానికీ అధికారికంగా ప్రతిపక్ష హోదా లేదు కదా అని రేవణాలు తీస్తున్న మోదీ బృందం ఇప్పుడు అధికారికంగా ప్రతిపక్షంగా గుర్తించదగినంత మంది సభ్యులు కాంగ్రెస్‌కు ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఇది మోదీ మార్కు ప్రజాస్వామ్యం కనకే ఏ నిబంధనలను, ఆనవాయితీలను ఖాతరు చేయరు. మోదీ బుల్డోజర్‌ రాజకీయాల పుణ్యమా అని మన పార్లమెంటు చరిత్రలో మొదటిసారి స్పీకర్‌ పదవికి బుధవారం ఎన్నిక అనివార్యం అవుతోంది. నడవడిలో నిండు నిరంకుశత్వం మరోసారి విలయ తాండవం చేయబోతోంది. ‘‘గత పది సంవత్సరాలలో మేం ఎప్పుడూ సంప్రాదాయాన్ని పాటించడానికే ప్రయత్నించాం. ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ అవసరం, కానీ దేశాన్ని నడపడానికి ఏకాభిప్రాయం అత్యంత ఆవశ్యకం’’ లాంటి మాటలు మోదీ నోటివెంట వింటే ఆవేశం, ఆగ్రహం కాదు జుగుప్స కలుగుతోంది. మోదీ వైఖరిలో వచ్చిన మార్పల్లా మాటల్లో సుద్దులు చెప్పడం, చేతల్లో మునుపటి ఆధిపత్య వైఖరినే అనుసరించడం చూస్తే ఆయన నిరంకుశ విధానాలకు మెజారిటీ కారణం కాదనీ అది ఆయనకు నరనరాన జీర్ణించుకుపోయినతత్వం అని స్పష్టం అవుతోంది. ఇంతకు ముందులాగా బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదని, మొన్నటి ఎన్నికలకకు ముందు మళ్లీ ప్రాణం పోసిన ఎన్‌.డి.ఎ. భాగస్వామ్య పక్షాల మీద, ఎన్నికల తరవాత తమ అవసరాల కోసం ఎన్‌.డి.ఎ.లో చేరిపోయిన తెలుగుదేశం, జె.డి.(యు) మీద ఆధారపడి ప్రభుత్వం నడపాలంటే సంకీర్ణ ధర్మం పాటించాలన్న ధ్యాసే మోదీకి లేదు. సోమవారం మోదీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీని మళ్లీ తవ్వి తీశారు. ఎమర్జెన్సీ అప్పుడూ ప్రజాస్వామ్యవాదులు, సవ్యంగా ఆలోచించేవారెవరూ సమర్థించలేదు. మోదీ ఎమర్జెన్సీ పాట పాడడం తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికే. ఎమర్జెన్సీ విధించకుండానే అంతకు మించిన నిరంకుశ పాలన కొనసాగిస్తున్న మోదీకి అసలు ఎమర్జెన్సీ పేరెత్తడానికే నైతిక హక్కులేదు. సమస్యంతా మోదీకి నైతికత బొత్తిగా లేకపోవడమే. అందరి సహకారం తీసుకుంటామని మోదీ అంటున్న మాటలకు వీసమెత్తు విలువలేదు. రాజ్యాంగ పవిత్రతను కాపాడతామని పదే పదే చెప్పడానికి అంతకన్నా వీలు లేదు. పార్లమెంటు సమావేశాల మొదటి రోజునే ప్రతిపక్షాలు రాజ్యాంగ ప్రతులు పట్టుకుని ఊరేగింపుగా వచ్చి నిరసన తెలియజేశారు. ఇదైనా మోదీకి హెచ్చరికగా పని చేస్తున్న నమ్మకమూ లేదు. నిన్నగాక మొన్న కళ్లు తెరిచిన టీడీపీ నాయకుడు, కేంద్ర మంత్రి కింజారపు రామమోహన నాయుడు కూడా షరతులు విధించడం ప్రజాస్వామ్య్ల లక్షణం కాదని సూక్తి ముక్తావళి వల్లిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పక్షం చర్చలకు, సంప్రదింపులకు, ఏకాభిప్రాయానికి విలువ ఇవ్వడం. అంతకన్నా ముఖ్యమైంది మైనారిటీ పక్షం మాట మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోక పోయినా ఆ పక్షానికి తమ అభిప్రాయం తెలియజేసే అవకాశం ఇవ్వడం. ఇది మోదీ హయాంలో కలికానిక్కూడా లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img