London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రగతికి జేగంటగా…

వానాకాలం చదువులు మళ్లీ మొదలయ్యాయి. ప్రాథమిక విద్యారంగాన్ని సముద్ధరించాలన్న శుభసంకల్పం పాలకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నా దశాబ్దాల తరబడి తిష్టవేసిన మౌలిక సమస్యలు ఏటా వెంటాడుతూనే ఉన్నాయి. నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతోనూ, ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా విద్యాప్రణాళిక తయారుచేస్తున్నామన్న పాలకుల మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఈ ప్రకటనలు చేతలుగా మారితే అంతకన్నా మహద్భాగ్యం వేరే ఉండదు. విద్యావ్యవస్థలో నేడు అనేక నూతన సవాళ్లు ఎదురవుతున్నాయి. రాశిలో తప్ప వాసిలో ఎంతో వెనుకబడిన దృశ్యమే మన విద్యావ్యవస్థ దుస్థితిని ప్రతిబింబి స్తోంది. ప్రతి ఉదయం మోగే బడిగంట భావితరాలకు భాగ్యోదయానికి జేగంట కావాలని అకాంక్షించే ఆలోచనాపరుల్ని నిర్వేదంలో ముంచేలా దేశవ్యాప్తంగా చదువుల రంగం చచ్చుపడిపోయింది. మన దేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యావిధానం కేవలం అంశాలను బట్టీపట్టడానికీ, మార్కులు, ర్యాంకులకే పరిమితమైంది. సిలబస్‌, బోధన అందుకు అనుగుణం గానే సాగుతోంది. తార్కిక ఆలోచనకు, మానసిక స్వేచ్ఛకు, సృజనాత్మ కతకు ఎంత మాత్రం ఈ విధానం దోహదం చేయదు. ర్యాంకులు, మార్కులు విద్యార్థి ప్రతిభను చూపేవి కావు. అయితే అధిక మార్కులు, ర్యాంకులు సాధించలేని పిల్లలు నిరాశ, నిస్పృహలకులోనై ఇతర మార్గాలను అవలంబిస్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటు న్నాయి. దేశ భవిత తరగతిగదిలో నిర్ణయమవుతుందని కొఠారి కమిషన్‌ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. విద్యార్థికి భారంగా తయారైన పాఠ్యాంశాలు ఉండకూడదని ఆ కమిషన్‌ పేర్కొంది. దీనివల్ల విచక్షణ జ్ఞానం పెరగదని సూచించింది. బాలలందరికీ ప్రాథమిక విద్య సక్రమంగా సమకూరితేనే జాతికి ఆర్థికాభ్యున్నతి ఒనగూడుతుంది. విజ్ఞానం కోసం పెట్టే పెట్టుబడి ఎప్పటికీ సత్ఫలితాలు అందిస్తుందన్నది కాదనలేని నగ్నసత్యం. ఈ పెట్టుబడి నేడు మన దేశంలో పిల్లలను ధనార్జన యంత్రాలుగా మార్చేస్తోంది. ప్రాథమిక దశ నుంచే పిల్లలపై తీవ్రభారం మోపుతోంది. స్కూల్‌బ్యాగ్‌ ఎంత బరువుగా ఉంటే తమ పిల్లలు అంతగా చదువుతారనే నమ్మకం తల్లి దండ్రుల్లో బాగా పెరిగిపోయింది. విద్యాబోధనను వ్యాపారంగా మార్చేసిన విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ భారాల చదువే తమకు లాభసాటిగా ఉంటుందని బాగా ప్రచారం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ముక్కు పచ్చలారని బాలలపై స్కూలు బ్యాగ్‌ల బరువు వారి జీవితాలకు శాపంగా మారుతున్న వాస్తవాన్ని అటు తల్లిదండ్రులు, ఇటు యాజమాన్యాలు విస్మరించడం దారుణం. దశాబ్దాలుగా విద్యావేత్తలు, మేధావులు, వైద్యనిపుణులు, సామాజిక కార్యకర్తలు ఈ స్కూలు బ్యాగ్‌ల బరువుపై ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు.
నూతన పరిస్థితులకు అనుగుణంగా జ్ఞానం పొందడానికి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమన్న అంశాన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి తగుచర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఆసక్తితో, ఇష్టంతో అంశాలను తెలుసుకునేందుకు జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మార్పులు చేయాలి. విద్యనభ్య సించడంలో ఆనందం ఉందని పిల్లలు భావించేలా సంస్కరణలు ఉండాలి. అయితే, సమాజ నడవడికకు ఇంధనంగా ఉన్న విద్య ప్రైవేట్‌పరం అవుతుంటే సామాజిక, నైతక విలువలు పతనమై లాభనష్టాల పునాదులుగా కలిగిన మార్కెట్‌ సమాజం తయారవు తుందనడంలో ఎటువంటి అనుమానంలేదు. నేడు అనుసరిస్తున్న విద్యా విధానం మూలంగానే విద్యార్థులు తమ చదువులు ముగిసిన తర్వాత జీవితంలో చక్కగా స్థిరపడలేక పోతున్నారు. విద్యలో నాణ్యత లోపించడం వల్ల జీవితంలో ఏ రంగంలోకి ప్రవేశించినా వెనుకబాటుతనానికి గురవుతున్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని చిన్నతనం నుంచి నేర్పించాలన్న ఆలోచన కూడా సరైంది కాదు. సృజనాత్మక ఆలోచనకు ఉపయోగ పడకుండా నేర్చుకునే సాంకేతిక విజ్ఞానం సైతం భారంగానే ఉంటుంది. విచక్షణతో కూడిన ఆలోచన స్థానే అంశాలను జ్ఞాపకం ఉంచుకోవడానికి పరిమితం చేయడం వల్ల వారిలో తార్కికబుద్ధి సన్నగిల్లుతోంది. కేవలం సమాచారాన్ని అందించే విద్య వల్ల పిల్లల్లోని అంతర్గత శక్తి వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు. పిల్లలు చదువుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. టీచరు మార్గదర్శకత్వంలో వివిధ అంశాలు, విషయాలపై వారికి అవగాహన కల్పించాలి. వివిధ రకాల వస్తువులను చూపించి వాటిని గురించి వివరించడం ద్వారా తాము సైతం అలాంటివి ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచనను వారిలో రేకెత్తించాలి. అప్పుడే సృజనాత్మకత, అంత:శక్తి వెలుగుచూస్తుంది. బాల్యంలో విద్య మానసిక హింసకు, భారానికి దారి తీయరాదు. ఇప్పుడు స్కూళ్లల్లో ఎన్నో అంశాలను బోధిస్తున్నప్పటికీ నేర్చుకునేది చాలా స్వల్పం. విద్య పిల్లల అంతర్గత శక్తుల ప్రేరణకు, స్వేచ్ఛగా ఆలోచించేందుకు తగిన భూమికను కల్పించాలి. సహేతుక ఆలోచనకు, సృజనాత్మకతకు, మానసిక వికాసానికి ప్రాథమిక దశలోనే మంచి పునాదులు ఏర్పడాలి. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం తెచ్చినా నీరుగార్చే సవరణలకూ పాలకులు నడుంకట్టిన దౌర్భాగ్యం మనది. ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా మారిందన్న సంతోషాన్ని అంతలోనే విరిచేసిన ఘనత మన పాలకులది. జాతి ప్రగతికి ఇరుసు కాగలిగే శాస్త్రీయ విద్యావిధానం రూపుదాల్చి నిర్ధిష్ట కాలవ్యవధి ప్రణాళికలతో పట్టాలకెక్కేదాక ప్రస్తుత వ్యవస్థలో లొసుగులు, లోపాలను చక్కదిద్దుకుంటూ ముందడుగేయడమే పాలకులు ఇప్పుడు చేయాల్సిన పని. విలువలు, సక్రమ విధానాలు అనుసరించినప్పుడే ప్రతి బడి గంటా జాతికి జేగంటగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘‘ప్రతి తరగతి గతి దేశ భవితకు గర్భగుడి’’ అని నమ్ముతున్న దేశాలు ప్రాథమిక విద్యాబోధనలో అనుసరిస్తున్న విప్లవాత్మక ఒరవడి మనకు గుణపాఠం కావాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img