London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రోటెం స్పీకర్‌పై వ్యర్ధ వివాదం

సంప్రదాయాలను, ఆనవాయితీలను ఉల్లంఘించడమే పనిగా పెట్టుకున్న బీజేపీ ప్రోటెం స్పీకర్‌గా ఎవరిని నియమిం చాలన్న అంశంలోనూ ఉల్లంఘన సంప్రదాయాన్నే అనుసరి స్తోంది. ఎనిమిది సార్లు లోకసభకు ఎన్నికైన కేరళకు చెందిన కొదికున్నిల్‌ సురేశ్‌ను కాదని ఏడు సార్లు ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌ను బీజేపీ ప్రోటెం స్పీకర్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేయడం కూడా పూర్తి అయింది. ఎనిమిది సార్లు లోకసభకు ఎన్నికైన సురేశ్‌ను కాదని మహతాబ్‌ను ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నకు ప్రభుత్వ పక్షం ఇచ్చిన వివరణ విచిత్రంగా ఉంది. సురేశ్‌ ఎనిమిది సార్లు ఎన్నికైనా ఆయన వరసగా ఎన్నిక కాలేదు కనక వరసగా ఏడు సార్లు ఎన్నికైన మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా ఎంపిక చేశామని పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అంటున్నారు. రిజిజు కలహ ప్రియుడు. వివాదాస్పదంగా మాట్లాడడమే ఆయన ప్రత్యేకత. పైగా సురేశ్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమించవలసిం దని కాంగ్రెస్‌ వాదిస్తున్నందుకు ఆయనకు సిగ్గేసిందట. ఇది దేవతా వస్త్రాలు వేసుకున్న వ్యక్తి లక్షణంగా దుస్తులు ధరించిన వారిని చూసి సిగ్గు పడ్డట్టుగా ఉంది. నిజానికి ప్రోటెం స్పీకర్‌ స్థానం తాత్కాలికమైంది. ప్రోటెం స్పీకర్‌గా ఉన్న వారు చేసేదల్లా కొత్తగా ఎన్నికైన లోకసభ సభ్యుల చేత ప్రమాణం చేయించడం. ఇది మహా అయితే రెండు రోజులు జరగవచ్చు. పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. బుధవారం మోదీ లోకసభ స్పీకర్‌ అభ్యర్థిని ప్రకటిస్తారట. తమ అభ్యర్థిని బీజేపీ గెలిపించు కోగలిగిన స్థితిలోనే ఉంది. అలాంటప్పుడు తాత్కాలిక స్పీకర్‌ స్థానం కోసం ఆనవాయితీలను ఉల్లంఘించడం అర్థరహితం. మోదీ నాయక త్వం లోని బీజేపీకి ఆనవాయితీలను పాటించడం మీద కన్నా ఉల్లంఘించడం మీదే ఎక్కువ ఆసక్తి. దీనివల్ల 18వ లోకసభ మొదటి రోజు సమావేశంలోనే బలం పుంజుకున్న ప్రతిపక్షంతో జగడం పెట్టుకోవాలన్నదే బీజేపీ అభిమతంగా కనిపిస్తోంది. బీజేపీ వైఖరి, విధానం ఏమైనప్పటికీ ఆనవాయితీలను మంటగలపడం మాత్రం నిర్విఘ్నంగా కొనసాగబోతోంది. ఇది సంపూర్ణంగా ప్రజాస్వామ్య విరుద్ధమైన ధోరణి. సురేశ్‌ను ప్రోటెం స్పీకర్‌గా అధికార పక్షం అంగీకరించకపోవడంలో మరేదన్నా మతలబు ఉందేమో తెలియదు. ప్రోటెం స్పీకర్‌కు సంబంధించి కాంగ్రెస్‌ తప్పు చేస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తోందని రిజిజు ఆరోపిస్తున్నారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పి తమ వీపు తామే చరుచుకుం టున్నారు. అందరికన్నా సీనియర్‌ సభ్యుడిని అంటే ఉన్న వారిలో అందరికన్నా సీనియర్‌ సభ్యుడిని ప్రోటెం స్పీకర్‌గా నియమించడం చారిత్రకంగా కనిపిస్తున్న పద్ధతి. ప్రస్తుత లోకసభలో సురేశ్‌తో పాటు ఎనిమిది సార్లు ఎన్నికైన బీజేపీ సభ్యుడు వీరేంద్ర కుమార్‌ కూడా ఉన్నా ఆయననూ బీజేపీ నాయకత్వం విస్మరించింది. అందుకే ఏడు సార్లు ఎన్నికైన మెహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమించడంలో ఇతరేతర ఉద్దేశాలున్నాయేమోనని అనుకోక తప్పని పరిస్థితి. మహతాబ్‌ ఒడిశాకు చెందిన వారు. అక్కడ మొదటిసారి ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ మైకంలో మహతాబ్‌ను ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. పైగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే మహతాబ్‌ బిజూ జనతాదళ్‌ లోంచి బీజేపీలోకి దూకి విజయం సాధించారు. ఆయనను తాత్కాలిక స్పీకర్‌ని చేసి సంతృప్తి పరచాలన్నది బీజేపీ ఆలోచన కాబోలు. మహతాబ్‌నే స్పీకర్‌గా ఎన్నికయ్యేట్టు చూడాలన్న ఆలోచన కూడా బీజేపీకి ఉంది.
ప్రోటెం స్పీకర్‌ను బ్రిటిష్‌ పార్లమెంటరీ సంప్రదాయంలో సభకు తండ్రి లాంటి వాడిగా భావిస్తారని, మనం అనుసరిస్తున్నది బ్రిటిష్‌ పద్ధతే కనక మహతాబ్‌ను ఎంపిక చేశామని రిజిజు చెప్తున్నారు. అది నిజమేననుకున్నా అందులో నిరంతరంగా సభ్యుడిగా ఉండడం అన్న అంశం చేర్చింది మాత్రం బీజేపీ నాయకత్వమే. లేక పోతే సురేశ్‌కు ఆ అవకాశం దక్కేది. అయితే లోకసభ సభ్యుడినే ప్రోటెం స్పీకర్‌గా నియమించే విధానం పాటించని సందర్భాలు రెండు ఉన్నాయి. 1956లో సర్దార్‌ హుకుం సింగ్‌ను, 1977లో డి.ఎన్‌. తివారీని ప్రోటెం స్పీకర్లుగా నియమించారు. అప్పుడు వారిద్దరూ అందరికన్నా సీనియర్లేమీ కాదు. 2019ల్లోనూ బీజేపీ వీరేంద్ర కుమార్‌ను తాత్కాలిక స్పీకర్‌ను చేసింది. అప్పటికి ఆయన ఏడవసారి లోకసభకు ఎన్నిక య్యారు. అయితే ఆ సమయానికి ఎనిమిది సార్లు లోకసభకు ఎన్నికైన మేనకా గాంధీ ఉన్నారు. ఆమె కూడా మధ్యలో 1991లో ఒక సారి ఓడిపోయారు. అదీగాక అప్పుడు ఆమె తనను మంత్రిని చేస్తారనుకు న్నారు. మంత్రి పదవి ఇవ్వలేదు కనక ప్రోటెం స్పీకర్‌ పదవిని అంగీకరించలేదు. ఆ సమయంలో కూడా సురేశ్‌ ఏడు సార్లు ఎన్నికైన సభ్యుడే. ఆయనతో పాటు వీరేంద్ర కుమార్‌ కటిక్‌ కూడా ఏడు సార్లు ఎన్నికయ్యారు. ఆయనను మంత్రిని చేశారు కనక నిబంధనల ప్రకారం సురేశ్‌ను ప్రోటెం స్పీకర్‌ చేయాల్సింది. అదీ జరగలేదు. వైపరీత్యం ఏమిటంటే తమ పక్షపాత ధోరణిని సమర్థించుకోవడానికి కిరణ్‌ రిజుజు క్రమ తప్పిన సందర్భాలనే ఉటంకిస్తున్నారు. ప్రోటెం స్పీకర్‌ స్థానం అత్యంత సీనియర్‌ సభ్యుడికి ఇచ్చే మర్యాద మాత్రమే. రెండు మూడు రోజులు తాత్కాలిక స్పీకర్‌గా ఉన్నంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. అదనపు ప్రయోజనాలూ ఉండవు. జీవీ మౌలంకర్‌తో మొదలు పెట్టి ఎన్‌.జి. రంగా, ఇంద్రజిత్‌ గుప్తా, సోంనాథ్‌ చటర్జీ, బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌, జగ్జీవన్‌ రాం, భువనానంద దాస్‌, మాణిక్‌ రావు హోద్ల్యా గోవిట్‌, కమల్‌ నాథ్‌ వంటి వారు ప్రోటెం స్పీకర్లుగా వ్యవహరించారు. బీజేపీ విధి విధానాలను, ఆనవాయితీలను పాటించనందువల్లే వివాదాలు రేకెత్తుతున్నాయి. నియమోల్లంఘనను సమర్థించుకోవడానికి చూపే పూర్వోదంతాలు సైతం దోష ప్రకరణంలోనివే కావడం అంతకన్నా వివాదాస్పదం. బీజేపీ మొన్నటి ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితమైనా, ఎన్నికల ముందు హడావుడిగా పునరుద్ధరించిన ఎన్‌.డి.ఎ. భాగస్వామ్య పక్షాల, తెలుగుదేశం, జనతా డళ్‌ (యు) లాంటి పార్టీల మద్దతు తీసు కుంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నా మోదీ అహంకారం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతిపక్షాలను గౌరవించే మర్యాద మోదీకి ఎప్పుడూ లేదు. ఉన్న వ్యవస్థలను, విధానాలను విరూపం చేయడం అది సాధ్యం కానప్పుడు ధ్వంసం చేయడం మాత్రమే ఆయనకు తెలిసిన విద్య. 2047 దాకా అధికారంలో కొనసాగాలన్న దురాశ ఆయనకు ఉండొచ్చు. అది ఎటూ సాధ్యం కాదు. ఈ లోపల అనేక వ్యవస్థలు కుప్పకూలి పోతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img