Monday, October 28, 2024
Monday, October 28, 2024

అధ్యక్ష అభ్యర్థి మార్కెజ్‌కు మద్దతిస్తాం

వెనిజులా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన
కారకస్‌: వెనిజులా అధ్యక్ష అభ్యర్థి ఎన్రిక్‌ మార్కెజ్‌కు మద్దతిస్తున్నట్లు వెనిజులా కమ్యూనిస్టు పార్టీ (పీసీవీ) ప్రకటించింది. 16వ జాతీయ సదస్సు మూడవ దశ ముగిసిన తర్వాత పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫిగురే ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈనెల 28న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు అనుసరించే వ్యూహాలపై ఈ సదస్సు చర్చించింది. వెనిజులా కమ్యూనిస్టుల మద్దతు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు మార్కస్‌ వెల్లడిరచారు. వెనిజులా చరిత్రలో కీలకమైన పార్టీ తన వెంట నిలవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్మికులతో కలిసి దేశాన్ని పున:నిర్మిద్దామంటూ పిలుపునిచ్చారు. కలిసి ముందుకెళదామని, ఐక్యతా భావంతో పనిచేద్దామని, సహనశీల దేశాన్ని నిర్మిద్దామని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img