వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం వల్ల ఆ స్థానాన్ని దక్కించుకునేదెవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సొంత డెమోక్రాట్ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హ్యారిస్‌కే అధ్యక్ష అభ్యర్థిగా మద్దతిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. అయితే కమలా హ్యారిస్ సొంతపార్టీలోనే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మరి కొందరు కీలక నేతలు కూడా డెమొక్రటిక్ అభ్యర్థిత్వనాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రేసులో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ముందున్నారు. ఇప్పటికై బైడెన్ కూడా హ్యారిస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో కమలా హ్యారిస్(59) కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. కమలా హ్యారిస్ తర్వాత జేబీ ప్రిట్జ్కర్ ప్రస్తుతం ఇల్లినాయీ గవర్నర్‌గా ఉన్నారు. అమెరికాలో అత్యంత ధనిక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రిట్జ్కర్ నికర ఆస్తుల విలువ 3.4 బిలియన్ డాలర్లు. అమెరికా రాజ్యాంగ సవరణలకు మద్దతు ఇచ్చారు. ‘‘థింక్ బిగ్ అమెరికా’’ అనే నినాదంతో ప్రజల మద్దతు పెంచుకున్నారు. మరొకరు మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మెర్… శాసనసభలో ఒకటిన్నర దశాబ్దంపాటు పనిచేశారు. డెమొక్రటిక్ పార్టీలో వేగంగా ఎదిగిన మహిళా నేతగా గుర్తింపు పొందారు. డెమొక్రటిక్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన స్పీకర్‌గా ఉన్నారు. అబార్షన్ హక్కులపై గళం విప్పి మహిళలను ఆకట్టుకున్నారు.అధ్యక్ష అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు. జాతీయ రాజకీయ కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరొక నేత గావిన్ న్యూసమ్… గావిన్ న్యూసమ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్నారు.1995లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో స్వలింగ జంటలకు వివాహ లైసెన్సును జారీ చేసి అందరి దృష్టి ఆకర్షించారు. బైడెన్‌కు బలమైన నమ్మకస్థుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. గావిన్‌కు కాలిఫోర్నియా అంతటా రెస్టారెంట్లు, రిసార్ట్లు ఉన్నాయి. జోష్ షాపిరో… జోష్ షాపిరో పెన్సిల్వేనియా గవర్నర్‌గా ఉన్నారు. పెన్సిల్వేనియాలో ఎదుగుతున్న రాజకీయ స్టార్‌గా ఆయనను చూస్తారు. ట్రంప్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఓడిరచి గవర్నర్‌గా రెండోసారి అధికారం చేపట్టారు. రెండుసార్లు అటార్నీ జనరల్‌గా, ఒకసారి గవర్నర్‌గా చేశారు. హమాస్‌పై పోరులో ఇజ్రాయిల్‌కు సంఫీుభావం ప్రకటించారు. రాయ్ కూపర్… ఉత్తర కరొలినా డెమొక్రటిక్ గవర్నర్‌గా ఉన్నారు. ఆరు సాధారణ ఎన్నికల్లో విజయం కేతనం ఎగరేశారు. పరిపాలన, చట్టసభలపై మంచి అవగాహన ఉంది. ప్రభుత్వ విద్య, అబార్షన్ హక్కుల కోసం పోరాడారు. న్యాయ విద్యను అభ్యసించారు. ఆండీ బెషీర్… బెషీర్ కెంటకీ గవర్నర్‌గా ఉన్నారు. ట్రంప్ ఆమోదించిన రిపబ్లికన్ అభ్యర్థిని ఓడిరచి స్టార్‌గా గుర్తింపు పొందారు. గత ఏడాది రెండోసారి కూడా ఎన్నికల్లో గెలుపొందారు . అబార్షన్ హక్కులకు మద్దతు ఇచ్చారు. కెంటకీలో అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. బెషీర్ 2015లో అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. మార్క్ కెల్లీ… అరిజోనాకు చెందిన సెనెటర్. వ్యోమగామిగా పనిచేసి దేశం దృష్టిని ఆకర్షించారు. కెల్లీ గత ఎన్నికల్లో ఇతర డెమొక్రాట్ల కంటే ఎక్కువ ఓట్లను సంపాదించారు. రాజకీయ హింసకు కెల్లీ కుటుంబం బలైపోయింది. గన్ నియంత్రణకు కెల్లీ పోరాటం చేస్తున్నారు. నాసాలో చేరడానికి ముందు గల్ఫ్ యుద్ధంలో పాల్గొన్నారు. స్పేస్ షటిల్లో మూడు మిషన్లకు నేతృత్వం వహించారు.