హవానా: తమ భూభాగంలోకి అమెరికా దళాలు చొరబడుతుండటాన్ని క్యూబా ఆక్షేపించింది. ఆహ్వానం లేనిదే ఏ దేశ దళాలు కూడా ఇతరుల భూభాగంలోకి ప్రవేశించరాదని పేర్కొంది. ఆక్రమిత ప్రాంతంగా భావించే గ్వాంటనామా బే నావికా స్థావరం వద్ద అమెరికా అణు`జలాంతర్గామి ఉండటాన్ని వ్యతిరేకించింది. కొన్నేళ్ల కిందట హవానా, వాషింగ్టన్ మధ్య కుదిరిన అవగాహన మేరకు అమెరికా నౌక గురించి సమాచారం ఉన్నప్పటికీ, ఆహ్వానం లేకుండా రావడాన్ని తాము ఆక్షేపిస్తున్నట్లు క్యూబా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కార్లోస్ ఫెర్నాండెజ్ వెల్లడిరచారు. ఆహ్వానించినప్పుడు మాత్రమే విదేశీ నౌకలు రాగలవని, అమెరికా భిన్నంగా వ్యవహరించిందని అన్నారు. హవానా పోర్టును రష్యాకు చెందిన నాలుగు నౌకలు సందర్శించి, సోమవారం వరకు అక్కడే ఉండనున్న క్రమంలో గ్వాంటనామా బే నేవల్ బేస్ జలాల్లోకి అమెరికా సదరన్ కమాండ్‌కు చెందిన యూఎస్ఎస్ హెలేనా (అణుశక్తిగల జలాంతర్గామి) చేరుకోవడం ఆక్షేపణీయమని, ఇది అక్రమ ప్రవేశంగానే పరిగణించాలని క్యూబా మంత్రి అన్నారు.