London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

ఇరాన్‌ అధ్యక్షుడిగా మసూద్‌ పెజెష్కియాన్‌

టెహ్రాన్‌: ఇరాన్‌కు తొమ్మిదో అధ్యక్షుడిగా ప్రముఖ సంస్కరణవాది మసూద్‌ పెజెష్కియాన్‌ (69) ఎన్నికయ్యారు. జూన్‌ 28న జరిగిన తొలి రౌండు ఎన్నికల్లో 40 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు. శనివారం జరిగిన రెండవ రౌండు తర్వాత 49.8శాతం పోలింగ్‌ నమోదైంది. లెక్కించిన 30,530,157 ఓట్లలో నుంచి మసూద్‌కు 53.3శాతం అంటే 16,384,403 ఓట్లు వచ్చాయి. మసూద్‌కు సమీప ప్రత్యర్థి, అల్ట్రా కన్జర్వేటివ్‌ నేత సయ్యద్‌ జలీల్‌కు 44.3శాతం అంటే 13,548,179 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మసూద్‌ను విజేతగా పేర్కొంది. ఈయన సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 10వ పార్లమెంటులో వైస్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. మహమ్మద్‌ హత్మానీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా నాలుగేళ్లు పనిచేశారు. తబ్రీజ్‌ యూనివర్సిటీ చాన్సలర్‌గానూ సేవలు అందించారు. ఉత్తర ఇరాన్‌లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం అకడమిక్‌ సాఫ్‌ సభ్యునిగా ఉన్నారు. మసూద్‌ 2013లో, 2021లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నికక అనివార్యమైంది. మసూద్‌ ఎన్నిక కావడంతో రాజధాని టెహ్రాస్‌ సహా ఇరాన్‌లో సంబరాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. పచ్చ జెండాలు ప్రదర్శిస్తూ యువత ఉత్సాహాన్ని కనబర్చారు. కార్ల ర్యాలీలతో సందడి చేశారు. అయితే మసూద్‌ వృత్తిరీత్యా వైద్యుడు. హార్ట్‌ సర్జన్‌. ఆంక్షల సుడిగుండంలో చిక్కుకొని ఉన్న ఇరాన్‌ను ప్రపంచంతో మమేకం చేస్తామంటూ ఆయన దేశ పౌరులకు హామీనిచ్చారు.
దేశ ప్రగతికే ప్రాధాన్యత: మసూద్‌
ఎన్నికల్లో గెలుపు తర్వాత మసూద్‌ తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాభిమానం, ఆదరణతో అధ్యక్ష పీఠాన్ని అధీష్టించగలుగుతున్నట్లు వెల్లడిరచారు. దేశ ప్రజల శ్రేయస్సు, ఇరాన్‌ ప్రగతికి తొలి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రకటించారు. ఇందుకు ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు. కలిసికట్టుగా దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలతో ఇరాన్‌ను కలిపేందుకు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరికీ స్నేహ హస్తాన్ని అందిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img