కేప్ టౌన్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమాఫోసా తిరిగి ఎన్నికయ్యారు. ఐదేళ్లు పదవిలో కొనసాగబోతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో 283 ఓట్లతో రమాఫోసా గెలుపొందినట్లు ప్రధాన న్యాయమూర్తి రేమండ్ జోండో ప్రకటించారు. జస్టిస్ రేమండ్ అధ్యక్షతన నేషనల్ అసెంబ్లీ జరిగింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) నేత రమాఫోసా తిరిగి ఎన్నిక కాగా ఈ పదవికి పోటీ పడ్డ ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమాకు 44 ఓట్లు మాత్రమే వచ్చాయి. మే 29న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేషనల్ అసెంబ్లీలో 400కుగాను 159 స్థానాల్లో ఏఎన్సీ గెలిచింది. 30ఏళ్ల నుంచి పార్లమెంటు దిగువ సభలో కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీకి 50 స్థానాలు తగ్గాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డెమొక్రటిక్ అలయెన్స్ (డీఏ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏఎన్సీ ఒప్పందం చేసుకుంది. దీంతో డీఏ మద్దతుతో రమాఫోసా రెండవసారి అధ్యక్ష పీఠాన్ని అధీష్టించగలిగారు.