London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

2025లో చైనాలో ఎస్‌సీఓ సదస్సు

అస్తానా: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల తదుపరి సమావేశం 2025లో చైనాలో జరగబోతోంది. సంస్థ చైర్మన్‌షిప్‌ను చైనా చేపట్టనుంది. ఈ మేరకు ఎస్‌సీఓ ఆస్తానా తీర్మానం పేర్కొంది. ఎస్‌సీఓ సుస్థిరాభివృద్ధి వత్సరంగా 2025ను ప్రకటించాలని సభ్యదేశాలు అంగీకరించాయి. కజకస్థాన్‌ రాజధాని ఆస్తానాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం జరిగింది. ఇదే సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. చైనా-రష్యా సంబంధాలు మరింత బలపడినట్లు పుతిన్‌ అన్నారు. సంస్థాగత పనిలో ఎస్‌సీఓ సభ్యదేశాల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్‌సీఓ ప్రాదేశిక ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను సంస్కరించుకోవాలని పుతిన్‌ సూచించారు.
సభ్యదేశంగా బెలారస్‌
బెలారస్‌ పూరిస్థాయిలో ఎస్‌సీఓ సభ్యదేశమైంది. సంబంధిత పత్రాలపై అస్తానా సదస్సులో భాగంగా సంతకాలు జరిగాయి. ఎస్‌సీఓకు అధ్యక్షత వహిస్తున్న కజక్‌ అధ్యక్షుడు ఖాసిం జోమార్ట్‌ ఈ మేరకు ప్రకటించారు. ఎస్‌సీఓ 2001లో ఏర్పడిరది. భారత్‌, ఇరాన్‌, కజకస్థాన్‌, చైనా, కిర్గిస్థాన్‌, రష్యా, పాకిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సభ్యదేశాల సరసకు బెలారస్‌ చేరింది. అనేక దేశాలు పరిశీలకుల పాత్ర పోషిస్తుండటం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img