Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

అణు విద్యుత్‌లో చైనా మెరుపు వేగం

వాషింగ్టన్‌: అణువిద్యుత్‌ అభివృద్ధిలో చైనా మెరుపు వేగంతో దూసుకుపోతోందని అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. చైనా వేగానికి అమెరికా కనీసం 15 ఏళ్లు వెనుకబడిపోయిందని వెల్లడిరచింది. ప్రస్తుతం చైనా వద్ద 27 అణు విద్యుత్తు రియాక్టర్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొంది. ఒక్కో దానిని పూర్తి చేయడానికి బీజింగ్‌కు సగటున ఏడేళ్ల సమయం పడుతోందని తెలిపింది. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థ, ఈ రంగంలో సృజనాత్మక శక్తి పెరుగుదలకు ఇవి చాలా ఉపయోగపడతాయి. చైనాలోని ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు కూడా అణువిద్యుత్తు రంగా నికి కేవలం 1.4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. పశ్చిమదేశాలు ఇచ్చే అప్పులతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. దీనికితోడు వివిధ ప్రభుత్వ సంస్థలు వీటికి అండగా నిలుస్తున్నాయి. దీంతో స్థానికంగా అణువిద్యుత్తు రంగంలో ఇప్పుడు చైనా ప్రబల శక్తిగా ఎదిగింది. ఇప్పటికే బీజింగ్‌ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు కార్ల విషయంలో అగ్రగామిగా నిలిచింది. అణు విద్యుత్తులోనూ వేగంగా దూసుకెళుతోంది. షిడో బేలో నిర్మించిన నాలుగోతరానికి చెందిన హైటెంపరేచర్‌ గ్యాస్‌ కూల్డ్‌ రియాక్టర్‌ గతేడాది ఆన్‌లైన్‌లోకి వచ్చింది. దీనిపై ది చైనా న్యూక్లియర్‌ ఎనర్జీ అసోసియేషన్‌ స్పందిస్తూ… వీటిల్లో వినియోగించే 2,200 పరికరాలను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికా వద్దే అత్యధికంగా అణు రియాక్టర్లు ఉన్నాయి. కానీ, జో బైడెన్‌ సర్కారు పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా ఉద్గారాలు, శుద్ధ ఇంధనంపై దృష్టిపెట్టింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో 2023-24 సంవత్సరాల్లో రెండు భారీ న్యూక్లియర్‌ ప్లాంట్లు ఆన్‌లైన్‌ అయ్యాయి. కానీ, వీటి నిర్మాణ సమయం, ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు అమెరికా ఇంకా కొత్తగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఓ యూనివర్సిటీలో నిర్మించాలనుకొన్న ల్యాబ్‌ ప్రాజెక్టును మూసేసింది. అమెరికా ఈ రంగంపై పూర్తిస్థాయిలో దృష్టిపెడితే మాత్రం వేగంగానే చైనా కంటే ఎక్కువ అభివృద్ధి సాధించగలదని ఈ నివేదిక రాసిన స్టీఫెన్‌ ఎజెల్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img