Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – భయపడాల్సిన అవసరం లేదు

జిల్లా వైద్యాధికారిని:-సుహాసిని

విశాలాంధ్ర – మైలవరం: జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారిని సుహాసిని అన్నారు, గురువారం మండలంలోని పోరాటనగర్ లో జ్వరాల కారణంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి జ్వరాలు సోకకుండా ఉండేందువుకు ప్రజలకు అవగాహన కల్పించాలని,ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, ప్రజలు జ్వరాల బారిన పడినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉండాలని త్రాగునీరు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తగు సూచనలిచ్చి, జ్వరాల తీవ్రత తగ్గే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని,వ్యాధులకు సంబంధించిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు, ఈ సందర్భంగా డి ఎం ఓ మోతిబాబు,ఎంపీడీఓ లక్ష్మికుమారి,వైద్యాధికారులు డాక్టర్ నరేష్ సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి ఒక ప్రయివేటు వాటర్ ప్లాంటులో నీరు కలుషితమవుతున్నాయని గుర్తించి ప్లాంటును సీజ్ చేశారు, ప్లాంటు ద్వారా సరఫరా చేసే నీటిని పరీక్షలకు పంపాలని,రిపోర్టులు వచ్చే వరకు మూసేయాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ మోకా మౌనిక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img