న్యూదిల్లీ : భారత్‌కు చైనా రాయబారి జు ఫెహాంగ్ శుక్రవారం దిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్ భవన్‌ను సందర్శించారు. ఆయనకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండో
చైనా సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై ఫెహాంగ్తో రాజా చర్చించారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన చేసింది. రాజా వెంట సీపీఐ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్‌పాషా, రామకృష్ణ పాండా ఉన్నారు.