Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఉచిత విద్య, వైద్యాన్ని తాయిలాలుగా పరిగణించలేం

సుప్రీంను ఆశ్రయించిన ఆప్‌
అణగారిన వర్గాల కోసం అందించే విద్య, వైద్యం వంటి సామాజికార్ధిక పధకాలను ఉచితాలుగా పరిగణించలేమని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పేర్కొంది. ఈ అంశంలో పెండిరగ్‌ పిటిషన్‌లో జోక్యం చేసుకోవాలని ఆప్‌ సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరింది. ఎన్నికల్లో ఉచిత హామీలను గుప్పించే రాజకీయ పార్టీలపై చర్యలు చేపట్టాలని కోరుతూ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అర్హులైన అణగారిన వర్గాల ప్రజలకు వర్తింపచేసే పధకాలను తాయిలాలుగా పరిగణించలేమని ఆప్‌ పేర్కొంది. కనీస సౌకర్యాలు ప్రతి ఒక్కరికీ అందేలా సామ్యవాద, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అనుసరించాలని రాజ్యాంగం నిర్ధేశిస్తోందని తెలిపింది. భారత్‌ వంటి అసమానతలు నిండిన సమాజంలో బలహీన వర్గాల జీవితాలను మార్చే కార్యక్రమాలు, పధకాలు అత్యవసరమని ఆప్‌ పిటిషన్‌ స్పష్టం చేసింది. కాగా ఈ కేసును ఈనెల 11న సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు పార్టీలు ఓట్లు దండుకునేందుకు ఉచితాల పేరుతో తాయిలాల సంస్కృతిని ప్రవేశపెడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆరోపించగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ఉచితాల కిందకు రావని ఆప్‌ చీఫ్‌, ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దీటుగా బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img