Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

గడ్డు పరిస్థితులు రాబోతున్నాయ్‌..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌
భవిష్యత్తులో దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొవల్సి వస్తుందని, ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన సమయం అసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గడచిన 30ఏళ్లలో వివిధ ప్రభుత్వాల కృషి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగమించిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు..ఇది సంతోషించాల్సిన సందర్భం కాదు.. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం.. 1991 నాటి సంక్షోభం కన్నా గడ్డు పరిస్థితులు గోచరిస్తున్నాయని అన్నారు. గడచిన 30ఏళ్లలో వివిధ ప్రభుత్వాల కృషి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగమించిందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల వల్ల సుమారు 30 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. యువతకు కోట్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. స్వేచ్ఛాయుత వ్యాపారానికి ప్రోత్సాహం లభించడంతో ప్రపంచస్థాయి సంస్థలు వచ్చాయి.. దాంతో చాలా రంగాల్లో భారత్‌ ప్రపంచస్థాయి శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక రంగం సాధించిన ప్రగతికి గర్వపడుతున్నా అయితే కరోనా కారణంగా కోట్లాది మంది నష్టపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో విద్య, వైద్య రంగాల్లో దేశం ఇంకా చాలా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img