Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

బీసీ కుల గణన జరగాలి…

బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అంగడాల పూర్ణచంద్రరావు

విశాలాంధ్ర నందిగామ :- బీసీ కుల గణన వెంటనే నిర్వహించాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అంగడాల పూర్ణచంద్రరావు అన్నారు శుక్రవారం స్థానిక బీసీ నాయకులు ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో రాష్ట్రంలో వున్న అనేక బీసీ కుల సంఘాలు కలిసి సమావేశమై బీసీల ఉమ్మడి సమస్యల సాధన కొరకు ఒక సమన్వయ కమిటీ ఎన్నుకోవడం జరిగిందని,బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా ఆయనను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు అలాగే బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా బీసీ రమణ,
కో కన్వీనర్లు గా డి సూరిబాబు, కె. శ్రీరాములు,కె. నరసింహారావు,కదిరి రాము, పి.రామకృష్ణ,ఏ.రామచంద్ర, రావు,కరణం తిరుపతి రావు, మేక వెంకటేశ్వర్లు గౌడ్, ధరణికోట లక్ష్మి నారాయణ,మల్లవరపు సత్యనారాయణ,
కోశాధికారి గా వరగాని ఏడు కొండలు,అధికార ప్రతినిధులు గా అంపావతుని గోవిందు లను ఎన్నుకోవడం జరిగిందనీ తెలిపారు ఈ కమిటీ కార్యనిర్వాహాక సలహా దారులు గా పూర్వ డీజీపీ జె పూర్ణచంద్ర రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు,ప్రముఖ హై కోర్టు న్యాయవాది వై కోటేశ్వరరావు(వై కె)లను ఎన్నుకోవడం జరిగిందన్నారు
ఈ బీసీ సమన్వయ కమిటీ ప్రధానంగా “బీసీ కుల జన గణన “కొరకు ఉద్యమిస్తుంది.
అలాగే, బీసీ ఎదుర్కొనే సమస్యలపై కూడా ఉద్యమించేందుకు సిద్ధం అవుతుందని కేశన శంకర్ రావు,పూర్ణ చంద్రరావు తెలిపారు.ఈ కమిటీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని,త్వరలో జిల్లా, నియోజకవర్గం కమిటీలను నియమించి బీసీ కుల జనగనన కొరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంగం రాష్ట్ర నాయకులు యరగొర్ల రామారావు యాదవ్, అన్నవరపు నాగమల్లేశ్వర రావు,బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజు,రాష్ట్ర కార్యదర్శి కొదమల ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img