London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఆలింగనం కాదు రాష్ట్రాన్ని ఆదుకోవాలి

చలసాని వెంకటరామారావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు అపూర్వ మెజారిటీతో విజయం సాధించిన ఎన్డీయే కూటమి తరపున తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబునాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌కు శ్రీకారం అంటూ పత్రికలు పతాక శీర్షికలను ప్రకటించాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు, తెలుగుదేశం, కూటమి పక్షాలు సంబరాలు చేసుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి దగ్గరలో జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిధిగా హాజరై వేడుక ఆసాంతం వేదికపై ఉన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికపై ప్రధాన మంత్రికి పాదాభివందనం చేయాలని ప్రయత్నించగా మోదీ వారించి చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మోదీ ఏది చేసినా ఒక మతలబు ఉంటుంది. అది భవిష్యత్‌కు ఒక సూచికగా ఉంటుంది. గతంలో ప్రధానమంత్రి మోదీ అమరావతి శంకుస్థాపనకు 2014 అక్టోబరు 22 న రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంకు ముఖ్య అతిధిగా వచ్చారు. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ ఆంధ్ర ప్రజలకు వరాలు గుమ్మరిస్తారని, అమరావతి నిర్మాణానికి భారీ మొత్తం ప్రకటిస్తారని ఎదురుచూశారు. కానీ మోదీ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ఎటువంటి హామీ, భరోసా ఇవ్వకుండా దిల్లీ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ‘చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి’ ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టి వెళ్లారు. అది ఆనాడు మోదీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు ఏమి చేయబోతున్నదో తెలియజేసే భవిష్యత్‌ సూచికగా వ్యక్తం అయింది. అప్పటి నుంచి 2019 వరకు రాష్ట్రానికి, అమరావతికి ఆ చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టే గతి అయ్యాయి. చివరకు దిల్లీ చుట్టూ తిరిగి విసిగి వేసారిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం నాయకులు చంద్రబాబు ఎన్డీయేకు చెల్లుచీటీ ఇచ్చి కూటమి నుంచి బయటపడ్డారు.
ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చంద్రబాబును ఆలింగనం చేసుకోవటంపై వివిధ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మహాభారతంలో దృతరాష్ట్రుడు అంధుడు. కానీ అపారమైన బలశాలి. తన కొడుకుల దుర్మార్గాన్ని గుడ్డిగా సమర్థించేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల చేతిలో వందమంది కుమారులను కోల్పోయాడు. యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులతో పట్టాభిషేకం చేయించమని దృతరాష్ట్రుని దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడు భీముడిని అడిగి దగ్గరకు రమ్మని, దుర్యోధనుని సంహరించినందుకు, ప్రతిగా క్రోధంతో దీవిస్తున్నట్లుగా నటిస్తూ భీముడిని తాను బాహుబంధంలో బంధించబోయాడు. దృతరాష్ట్రుని దుష్ట బుద్ధిని ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు తన మాయతో ఇనుప భీముడ్ని సృష్టించి భీముని స్థానంలో ఆ ప్రతిమను ఉంచాడు. భీముడ్ని తన బాహువులతో నొక్కినొక్కి పిండి పిండి చేశాడు దృతరాష్ట్రుడు. దానిని దృతరాష్ట్ర కౌగిలి అంటారు. దుర్మార్గుడి చేతిలోపడితే భస్మమైపోతారని చెప్పటానికి దృతరాష్ట్రుని కౌగిలి అనేది ఒక జాతీయంగా మిగిలిపోయింది. ఇప్పుడు మోదీ కౌగిలి గతంలో మట్టి, నీళ్లు ఇచ్చినట్లు ధృతరాష్ట్ర కౌగిలి కాదుగదా? అని ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆనాటి కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం ఆ హామీలను బలపర్చింది. 2014 సాధారణ ఎన్నికలలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటమి చెంది నరేంద్రమోదీ ప్రధానిగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది.
ఆనాడు రాష్ట్ర విభజన చట్టంలో ఐదు ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ‘బుందేల్‌ఖండ్‌’ తరహాలో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పూర్తిచేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని, ఉమ్మడి రాష్ట్ర సిబ్బంది, ఆస్తులు, అప్పులు పంపిణీ నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ లోటు బడ్జెట్‌ను 2014`15 కేంద్ర బడ్జెట్‌లో భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. వీటికితోడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు వంటి వివిధ హామీలను ఇచ్చారు. 2014 మార్చి 1 న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ విభజన చట్టానికి ఆమోదముద్ర వేశారు. ఆ మరుసటిరోజు మార్చి 2 న విభజన చట్టానికి సవరణచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలవరం ముంపు మండలాలు ఏడిరటిని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. విద్యుత్‌ పంపిణీని ఈ సవరణలో సరిచేశారు. ఈ సందర్భంగా నాటి నూతన ప్రధానమంత్రి మోదీ తిరుపతి పుణ్య క్షేత్రానికి వచ్చిన సందర్భంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని ఆంధ్రప్రదేశ్‌కు నిర్మిస్తామని వాగ్దానంచేసి ఆశలు రేపారు. అంతకుముందు ఎన్నికల ప్రచారసబల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఆనాడు మిత్రపక్షాలపై ఆధారపడే పరిస్థితి లేకపోవటంతో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. విభజన చట్టంలోను, పార్లమెంటులోను ఇచ్చిన హామీలను గాలికి వదిలివేశారు. పార్లమెంటులో ఐదేళ్లు ప్రత్యేక హోదా అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటిస్తే కాదు 10 ఏళ్లు ఇవ్వాలని పట్టుబట్టిన వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ ప్రధాని మోదీపై వత్తిడి చేయలేకపోయారు. ప్రణాళిక సంఘం రద్దుచేసి దాని స్థానంలో ఏర్పాటు చేసిన నీతిఆయోగ్‌ ద్వారా ప్రత్యేక హోదాను నిరాకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే భాగస్వామిగా ఉండి వత్తిడి చేయగా హోదా సాధ్యంకాదని రాష్ట్రానికి ప్రత్యే క ప్యాకేజీ ఇస్తామని, హోదా వలన వచ్చే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని చెప్పి రాష్ట్రానికి మొండిచేయి చూపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు సమకూర్చుతామనిచెప్పి అంతకు ముందు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు విజయవాడ, గుంటూరు పట్టణాల అభివృద్ధికి కేటాయించిన వెయ్యికోట్లు కూడా కలిపి 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. వాస్తవానికి రాజధాని నిర్మాణానికి ఇచ్చింది 500 కోట్లు మాత్రమే. వెనుకబడిన ఏడు జిల్లాలకు అరకొరగా జిల్లాకు 50 కోట్ల చొప్పున మూడేళ్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారు. విశాఖపట్నం రైల్వేజోన్‌ను, కడప ఉక్కు ఫ్యాక్టరీని అటక ఎక్కించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధుల విడుదలలో కొర్రీలు పెడుతున్నారు. నిర్వాసితుల ప్యాకేజి విషయంలో తమకు సంబంధంలేదని, రాష్ట్రమే చెల్లించాలని వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తులు, అప్పులు సమస్యలు దశాబ్దకాలంగా పరిష్కారం కాకుండా నిలిచిపోయాయి. కేంద్రం ఈ విషయంలో సరైన చొరవను ప్రదర్శించటం లేదు. రాష్ట్ర లోటుబడ్జెట్‌ను భర్తీ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవటంతో విభజన హామీల అమలులో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. పోలవరం ప్రాజెక్టు పనులు, అమరావతి నిర్మాణం ప్రారంభించినా అభివృద్ధి, సంక్షేమంలో వెనుబడినందున ప్రజాగ్రహానికిగురై 2019 ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును, అమరావతి నిర్మాణాన్ని గాలికి వదిలివేశాడు. రాష్ట్రం ఈ ఐదేళ్లలో జగన్‌ పాలనలో భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా అన్ని రంగాలలో వెనుకబడిపోయింది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని 2024 ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు జగన్‌ను ఓడిరచారు. 2024 ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపటంలో జగన్‌కు సహకరించి, తెలుగుదేశం విజయం తథ్యమని తెలిసి చంద్రబాబును ఎన్‌.డి.ఏ.లో చేర్చుకుని రాజకీయ ప్రయోజనం పొందారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు 16 మంది మద్దతు లేకుండా కేంద్రప్రభుత్వం మనజాలని పరిస్థితి నేడు కేంద్రంలో ఉంది. విభజన హామీలను అమలు జరిపించు కోవటంలోను, అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించు కోవటంలో ఇప్పుడు చంద్రబాబు చాణక్యనీతిని ప్రదర్శించవలసిఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తికి, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం నుండి రాబట్టాలి. రైల్వేజోన్‌, కడప ఉక్కు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధించుకోవాలి. అభివృద్ధి, సంక్షేమం రెంటిని జోడు గుర్రాలుగా పరుగెత్తించాలంటే ఆర్ధిక వనరులు పెంచుకోవాలి. గత ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థికస్థితిని గాడిన పెట్టాలి. అందుకు చంద్రబాబు మోదీ కౌగిలింతల గిల్లింతలతో తృప్తి పడకుండా రాష్ట్రంలోని అన్ని పక్షాలను కలుపుకుని కేంద్రంపై పోరాటం సాగించాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే మోదీ ఆలింగనం దృతరాష్ట్ర కౌగిలి కాకుండా పోతుంది.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
సెల్‌: 9490952093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img