Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ఇది సామాన్యుల బడ్జెట్‌ అవుతుందా?

అనిల్‌ రాజింవాలె

నరేంద్ర మోదీ ప్రభుత్వం జులై 23న 2024`25కు పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ సమావేశాలు జులై 22నుండి ఆగస్టు 12వరకు జరుగుతాయి. సంస్కరణల పేరుతో పదేళ్లుగా అమలుచేస్తున్న విధానాన్ని కొనసాగిస్తారన్న సూచనలున్నాయి. ప్రభుత్వం పదేళ్లుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ విధానాలు ఇప్పటికే కుబేరులైన కార్పొరేట్లను మరింతగా మరింత సంపన్నులను చేసేందుకు ఉపయోగ పడ్డాయి. మన ప్రభుత్వరంగాన్ని అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు మోదీ పాలనసాగింది. మంచిస్థాయిలో ఉన్న ఆర్థికవ్యవస్థను కుదేలు పరిచారు. ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము రానున్న బడ్జెట్‌లో అనేక చారిత్రక చర్యలు ఉంటాయని అన్నారు. బీజేపీ పాలన ఉన్న కేంద్రం, రాష్ట్రాల్లో కచ్చితంగా ప్రజలను, దేశాన్ని దిగజార్చి కార్పొరేట్ల ఆర్థిక పెట్టుబడులను పెంచేందుకు అనేక చారిత్రక చర్యలు రానున్న బడ్జెట్‌లో ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్‌4న ప్రకటించినప్పటినుంచీ ఈక్విటీ షేర్‌మార్కెట్‌లో షేర్ల రేట్లు పెరుగుతాయని సంకేతాలు వచ్చాయి. బడా వాణిజ్యవేత్తలు భారీగా లాభాలు వస్తాయన్న అంచనాలు వేసుకుని ఉన్నారు. నిఫ్టీ, బిఎస్‌ఇలుపైపైకి పెరగనున్నాయని అంచనాలున్నాయి. అయితే ఉత్పత్తి, తయారీ రంగాలను పూర్తిగా విస్మరించ నున్నారు. సామాన్య ప్రజలకు ఉత్పాదకత, ఆర్థిక రంగానికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న అంచనాలు వచ్చాయి. మౌలిక సదు పాయాలు, వాణిజ్య అడ్డంకులు తొలగింపు, జీఎస్‌టీ దుర్వినియోగం లాంటివి ప్రభుత్వానికి తలనొప్పిగా ఉండవచ్చు. మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇంధనరంగం ప్రతినిధులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై చర్చలు జరిపారు. నగరీకరణను వేగిరం చేసేందుకు చర్యలు తీసుకోవాలని బడా వ్యాపారులు కోరారు.
రానున్న రెండేళ్లలో 15 నగరాల్లో రెండు బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుపెట్టే అవకాశం ఉందని హెచ్‌ఎఫ్‌సి పెట్టుబడిదారీ సలహాదారులు బెట్‌ కడుతున్నారు. అయితే సహజంగానే ఆర్థికరంగం, పెట్టుబడులు తగ్గనున్నాయి. సీఎంఇఐ సమాచారాన్ని బరోడా బ్యాంకు విశ్లేషించింది. ఉత్పత్తిరంగంలో పెట్టుబడులు 2025 జూన్‌తో ముగిసే త్రైమాసికంలో రూ.44200 కోట్లు తగ్గిపోతుందని తేల్చింది. ప్రభుత్వం మాత్రం ఆర్థికవృద్ధి సాధించామని చెప్పుకుంటోంది. ఈ సంవత్సరం మొదటి అర్థభాగంలో ఇండియాలో బడా కంపెనీలు ఈక్విటీ మార్కెట్‌ నుంచి రు.2.5లక్షల కోట్లు సమీకరించింది. భారత ఆర్థిక రంగం ఊహాజనితమైనది. అత్యంత సంపన్నుడైన అదానీ ముంద్రా ఓడరేవులో ఓడలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అదానీకి సేవలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నౌకల నిర్మాణంలో అతి పెద్ద సంస్థలలో అదానీ నిర్మించే సంస్థలలో ఒకటిగా నిలవాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రస్తుతం మన దేశం 20వ స్థానంలోఉంది. ముంద్రా ఓడరేవును రూ.45,000 కోట్లతో విస్తరించాలని నిర్ణయించిందన్న విషయం గుప్తంగా ఉంచారు. దీనివల్ల వాతావరణం దారుణంగా దెబ్బతింటుంది. అయినప్పటికీ వాతావరణానికి, తీరప్రాంత క్రమబద్దీకరణ జోన్‌లకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. అలాగే మహారాష్ట్ర తీరప్రాంతంలో అతి పెద్ద ఓడరేవును నిర్మించడానికి తలపెట్టింది. చైనా, దక్షిణకొరియా, జపాన్‌లలో యార్డులు నిర్మించడానికి 2028 వరకు అనుమతి పొందింది. ప్రభుత్వరంగ ఓడరేవులు, యార్డుల నిర్మాణాన్ని పక్కదారి పట్టిస్తోంది. అదానీ రోజు ఆదాయం రు.1600 కోట్లు ఉంటుందని అంచనా. స్టాక్‌మార్కెట్‌లో మోసాలకు పాల్పడినట్టు ఇప్పటికే బలమైన ఆరోపణలు వచ్చాయి. ఓడరేవులను ప్రభుత్వ, ప్రైవేటురంగాల పెట్టబడులతో నిర్మించనున్నారు.
ప్రభుత్వం 2025 ఆర్థిక సంవ్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్థుల విక్రయాల ద్వారా లక్ష కోట్లు రూపాయాలు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం జాప్యం కావచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందున ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని ఎస్‌బీఐ ఇటీవల ఆకస్మికంగా నివేదిక వెలువరించింది. అలాగే ఐడీబీఐ బ్యాంకు అమ్మకంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని కూడా ఎస్‌బీఐ కోరింది. అయితే ఐడీబీఐలోని 61శాతం వాటాలను ప్రభుత్వం, ఎల్‌ఐసి విక్రయిస్తున్నది. సరైన బిడ్డర్‌ కనిపించడంలేదని ఆర్‌బీఐ ఐడీబీఐని విక్రయించడం నిలిచిపోయింది. 2019 మార్చిలో ఐడీబీఐని ప్రైవేటుబ్యాంకుగా గుర్తించడంతో ప్రభుత్వం దాన్ని విక్రయించలేకపోతోంది. జూన్‌తో ప్రారంభమయ్యే త్రైమాసికంలో వేగంగా కొనుగోలుచేసే వినిమయ వస్తువుల కొనుగోలు నిలిచిపోయింది. పట్టణప్రాంతంలో విక్రయాల మాంద్యం మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుత రోజువారీ కొనుగోలుచేసే వస్తువులు, అత్యవసర సరుకులు, ఇళ్లల్లో తయారయ్యే వస్తువుల విక్రయాలు కూడా మందంగానే ఉంటోంది.
ఉద్యోగాలులేని అభివృద్ధి వేగవంతమవుతుంది. అందువల్ల బడా వాణిజ్య సంస్థలకు ప్రత్యేకించి అదానీ, అంబానీలకు రాయితీలివ్వడం వల్లనే వృద్ధిరేటు పెరుగుతోంది. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వ కాలంలో అనుసరించిన విధానాల వల్లభారీగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు విధ్వంసం పెద్దఎత్తున జరిగింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ, దిగుమతుల పెరుగుదల ఈ పరిశ్రమల రంగాన్ని ధ్వంసం చేసింది. యువతకు రానున్న పదేళ్లలో ఉద్యోగాలు కల్పించడానికి ప్రతి ఏటా మోదీ ప్రభుత్వం 12 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించవలసి ఉంటుందని అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ది సిటీ గ్రూపు నివేదిక తెలియజేసింది. జీడీపీ 7శాతం మాత్రమే ఉన్నందువల్ల ఎక్కువ ఉద్యోగాలు సృష్టించడం సాధ్యం కాదని తెలిపింది. వార్యానా(మనేసర్‌) లోని అమెజాన్‌ వేర్‌హౌస్‌లో కార్మికచట్టం ఉల్లంఘన జరిగాయి. చెన్న్తె, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఫ్యాక్టరీలో మహిళా కార్మికుల పట్ల వివక్షను పాటిస్తున్నారు. అలాగే లే ఆఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీల చట్టం 2013లో వందకుపైగా సవరణలు చేయడం ద్వారా దేశీయ కార్పొరేట్‌ రంగంలో ‘అలసత్వ భారం’ తగ్గించడానికి ప్రభుత్వం తలపెట్టింది. బడా వ్యాపారసంస్థల భారాన్ని తగ్గించి వాటి లాభాలు పెంచడానికే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మోదీ రెండోసారి పాలనలో సంపదపై పన్నును రద్దుచేశారు. కార్పొరేట్‌ సంస్థలు అసలేపన్నులు సక్రమంగా చెల్లించవు. అంతేకాదు, సామాజిక బాధ్యతలనుకూడా నెరవేర్చరు. ఈ నేపధ్యంలో సామాన్యుల కోసం ప్రణాళిలకను మోదీ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుందా అనేది పెద్దప్రశ్నార్థకం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img