London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఇదేమి సంస్కృతి

రా బావ ఏంటి పీకేయండి, తీసేయండి, తగలపెట్టండి పడగొట్టండి అంటూ ఆయాసపడుతూ వస్తున్నావు. ఆయాసం కాదయ్యా ఆవేశం అయిదేళ్ల క్రితం సంగతి గుర్తుకువచ్చి ఆవేశం ఆక్రోశంతో మాట్లాడుతున్నా. నీ కెందుకయ్యా అంత ఆవేశం. భలే నింపాదిగా అడుగుతున్నావు. అవునులే నీవు అన్నీ ఇంట్లో కూర్చుని పేపర్లో చదివి పెదవి విరిచి సరిపెట్టుకుంటావు. మేము అలా కాదుగా, గత ప్రభుత్వ బాధితులం. మేం కట్టిన బోర్డులన్నీ గత ప్రభుత్వం పీకేసింది. ఇప్పుడు మేము ఆ పనిచేస్తున్నాం. వాళ్లు తప్పు చేస్తే మీరు చెయ్యాలా…చేయకపోతే వారి తప్పులు వారి కెలా తెలుస్తయి అవును వైసీపీ వారు స్థలం లీజుకు తీసుకుని కట్టిన కార్యాలయాలు కూడా ధ్వంసం చేస్తున్నారుగా లీజు ఈ ప్రభుత్వం కాన్సిల్‌ చేసి నోటీసులు ఇచ్చిన తరువాత కదా కూల్చవలసింది. ముందయితే, వెనకయితే కూల్చడానికి. ఏదైనా వారు చేశారని మీరు, మీరు చేశారని వారు ఇలా విధ్వంస చర్యలు చేపట్టడం సరికాదు. ఇది మన సంస్కృతి కాదు. భలే చెబుతున్నావు బావ. అసలు సంస్కృతి అనే పదమే నేటి యువతకు తెలియదు. అయినా నువు నీతులు చెబుతున్నావుగాని మహనీయుల పేర్లు గౌరవ సూచకంగా పెట్టుకుంటే అవి కూడా మార్చేస్తున్నారు. ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పెడితే అది పీకిపారేసి వైఎస్సార్‌ పేరు పెట్టారు. అది అలా ఉంచి వేరే దానికి పెట్టుకోవచ్చు గదా అందుకే ఎన్నికల ఫలితాలు రాగానే పీకిపారేశారు. అది సరేనయ్యా ప్రభుత్వం మారగానే ఇలా తిట్టుకోవడం, కొట్టుకోవడం నేమ్‌ ప్లేట్లు పీకిపారేయడం ఇది మంచిదంటావా. అదేమరి మాకు చెబుతావుగాని అవతల పార్టీవారికి చెప్పు. అప్పుడు తెలుస్తుంది సంస్కృతి అంటే ఏమిటో. అది సరేనయ్యా ఒక సినిమాలో ఒక కవిగారు ఎలా స్వాగతం పలకాలో రాశాడయ్యా. మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం అని పలకాలని రాశాడు. నాకు నిజంగా నిన్ను చూస్తే నాకు నవ్వు వస్తోంది. అసలు రాజకీయాల్లో మంచివాళ్లు ఉండలేరుగా అప్పుడు ఆ పాటకు విలువేముంది. నువు ఇంకా పాత కాలంలో ఉన్నావు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం సంపాదించడం ఆ సొమ్ముతో ఓట్లు కొనడం మళ్లీ గెలవడం ఇదే రాజకీయం, ఇప్పుడు చెప్పు ఇటువంటి రాజకీయాల్లో మానవత్వంఉన్న మంచి మనుషులు ఎలా ఉంటారు అది సరే గాని పాపం ప్రతిపక్ష హోదా ఇమ్మని జగన్‌ కోరుతున్నాడు. అసలు ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి. ఎందుకంటే అడిగేవాడు లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు మృగ్యమై తప్పులు చేస్తూ ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడవచ్చు. అందుకే ప్రజాసమస్యలు చట్టసభల్లో వినిపించడానికి ప్రతిపక్షం బలంగా ఉండాలి. నిజమే పాపం అందుకేనేమో జగన్‌ ప్రతిపక్ష హోదా అడిగాడు. జగన్‌ని కాదు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజాసమస్యలు వినిపించడానికి ప్రతిపక్షం బలంగా లేకపోయినా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేకపోతే అధికార పార్టీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి వల్ల ప్రజలకు కలిగే నష్టం వివరించడానికి ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనిపించుకోదు. నిజమే బావ ప్రస్తుతం మన దేశంలో ప్రజాస్వామ్యం పేరిట అప్రజాస్వామ్యం కొనసాగుతోంది. ఒక నాయకుని ఆదేశాలు ఏమిటి ఎందుకు అని ప్రశ్నించకుండా కింది తరగతి నాయకులు, కార్యకర్తలు తు…చ తప్పకుండా ఆచరిస్తున్నారు. కనీసం మనకు తలకాయ ఉండి నాయకుని ఆదేశం ప్రజలకు మంచికా, చెడుకా అని ఆలోచించడం మానివేశారు. అందుకే ఒక మేధావి మన దేశంలో ప్రజాస్వామ్యం బదులు మూకస్వామ్యం కొనసాగుతోందన్నారు. నిజమే అందుకే ప్రభుత్వం మారగానే బడానాయకులు బాగానే ఉంటారు. కష్టపడి పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలను కొట్టడం, ఇల్లు కూల్చడం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ విష సంస్కృతికి స్వస్తి పలకాలి.
భావవ్యాప్తికి బదులు దాడుల వ్యాప్తి జరగడం శోచనీయం. ఈ పరిస్థితిలో అట్టడుగు వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నిజమే ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి..? ఏముంది. మేధావులు, రచయితలు ఈ నరమేథం ఆపడానికి నడుం బిగించాలి. కిందిస్థాయి కార్యకర్తలను వివేచనతో ఆలోచించేటట్లుగా చైతన్యపరచాలి. ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేయడం ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించి నిరసన తెలిపే హక్కు ప్రతి ఓటరుకు ఉంది. కాని అలా జరగని కారణంగా కార్యకర్తల్లో భయం గూడుకట్టుకుని ఉంది. అంతేకాక, కింది తరగతి నాయకులకు ఎరవేసి లోబరుచు కోవడంతో వారిలో స్వార్థం బలపడుతోంది. నిజమే ఇదంతా ఒక్కసారిగా మార్చడం కష్టమే… అయినా గ్రామాల్లో, పట్టణాల్లో ఓటరు విధులు, బాధ్యతలపై క్లాసులు తీసుకోవడం ద్వారా నిదానంగా వారి ఆలోచనల్లో మార్పు రావచ్చు. తద్వారా ప్రశ్నిచే హక్కు గుర్తించి నాయకులను ప్రశ్నించడం ద్వారా మార్పు రావచ్చు. అసలు ప్రయత్నం అవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img