London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన ?

టి.వి.సుబ్బయ్య

మణిపూర్‌లో ఏడాదికిపైగా ప్రజ్వరిల్లుతూ మంటలు చల్లార్చేందుకుగాను 2024 జూన్‌ 17 హోంమంత్రి అమిత్‌ షా మణిపూర్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. మెయితీలు (విష్ణుమూర్తి ఆరాధకులు, కుకీజో గిరిజనుల మధ్య భీకరమైన హింసాయుత పోరాటాలు జరిగాయి. అయితే అంతర్యుద్ధం లాంటి ఘర్షణలు మతోన్మాద ప్రేరేపణలు అన్న విమర్శలున్నాయి. అమిత్‌ ఏర్పాటుచేసిన సమావేశానికి ఘర్షణపడిన రెండు జాతుల ప్రతినిధులు, ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌, గవర్నర్లను ఆహ్వానించలేదు. ఇండియన్‌ సైనికదళాల ప్రధాన అధికారి మనోజ్‌ పాండే, ప్రధాన అధికారి హోదా కలిగిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టరు తపన్‌ కుమార్‌ దేకా పాల్గొన్నారు. వీరుగాక 2023 మే 3వ తేదీన మంటలు చెలరేగిన నేపధ్యంలో మణిపూర్‌కు రాష్ట్రం వెలుపలినుంచి తాత్కాలికంగా నియమించి రాష్ట్ర పోలీసు డైరెక్టరు రాజీవ్‌సింగ్‌లు పాల్గొన్నారు. ఈ పరిణామాలు రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్న సందేహాలు కలిగిస్తున్నాయి. రెండు జాతుల మధ్య దీర్ఘకాలంగా తీవ్ర విభేదాలున్నాయి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెయితీలకు కూడా రిజర్వేషన్లు కల్పించవలచ్చునని తీర్పు వెలువడిన తర్వాత కొద్ది రోజుల్లోనే రెండు జాతుల మధ్య హింసాయుత మంటలు చెలరేగాయి. అమిత్‌షా ఏర్పాటుచేసిన సమావేవానికి రాష్ట్రం నుంచి బాధ్యులెవ్వరినీ ఆహ్వానించకపోవడం ఆశ్చర్యాన్ని సందేహాలను కలిగించాయి. ఇప్పటికే రాష్ట్రంలో అనధికార రాష్ట్రపతిపాలన వాతావరణం కొనసాగుతోంది. రెండుజాతుల మధ్య మంటలు చెలరేగినప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా, ఎన్నికల్లో గెలవడంకోసం కర్నాటక తదితర రాష్ట్రాల్లో ప్రచారమే ముఖ్యమని భావించారు. అమిత్‌షా ఒకసారి మణిపూర్‌లో పర్యటించినప్పటికీ, పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. గిరజనులను కొండప్రాంతాల నుంచి తరిమివేసి ఆ ప్రాంతాల్లోఉన్న విలువైన ఖనిజాలను వెలికితీసేందుకు రెండు మూడేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వీటికోసమే హిందువులుగా పరిగణిస్తున్న మెయితీలను రెచ్చగొట్టారని ఆరోపణలున్నాయి. అంతేకాదు, అనేక సంవత్సరాలుగా సంఫ్‌ుపరివార్‌ శక్తులు మణిపూర్‌లో ఉంటూ మెయితీల మధ్య తిరుగుతూ, బీజేపీకి అనుకూలంగా మార్చారన్న వార్తలున్నాయి. గిరిజనులు వేలాదిమంది నివాసప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. నలుగురు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించినా బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడలేదు. నిందితులపై తీవ్ర చర్యలు తీసుకోలేదు. మహిళలను తాము ఎంతో గౌరవిస్తామని ప్రచారం చేసుకుంటారు. అమిత్‌ షా మరోసారి కొత్త దిల్లీలో ఇటీవల సమావేశం ఏర్పాటుచేశారు. మణిపూర్‌ గవర్నర్‌ అనసూయతో మాట్లాడారు. ఇతరులెవరూ పాల్గొనలేదు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఆర్టికల్‌ 354 ద్వారా విధించాలనే గవర్నర్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. హింసను నివారించేందుకుగాను ముందుగా రాష్ట్రపతి పాలన విధించి రెండు జాతులతో చర్చలు జరపాలని సన్నాహాలు చేస్తున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిని రాప్ట్రప్రభుత్వం ఇన్‌చార్జిగా లేకుండా చేసేందుకు ఆర్టికల్‌ 355ను విధించాలని తలపెట్టారన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్తలను తిరస్కరించింది. వివిధ రక్షణ విభాగాల కమాండర్‌ చైర్మన్‌గా ఉండవలసిన సంప్రదాయాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌ను తొలగించారు. ఇందుకు సంబంధించిన సమావేశాలను ఏర్పాటు చేయడానికే బిరేనసింగ్‌ను పరిమితం చేశారు. 2023 ఆగస్టు 9న ఇంతటి ఘోరం జరుగుతూ బిరేన్‌ను ఎందుకు తొలగించలేదని లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు అమిత్‌షా ముఖ్యమంత్రి తమకు సహకరిస్తున్నారని సమాధానం చెప్పారు. అంతకుముందు 2023 మే 3న గవర్నర్‌ ఉత్తర్వు ద్వారా బిరేన్‌సింగ్‌ కమాండిరగ్‌ చైర్మన్‌గా తప్పించారు. కేవలం సమావేశాల ఏర్పాటుకు పరిమితం చేశారు. హింసాకాండ చెలరేగిన 15రోజులు కొనసాగిన తర్వాతనే అమిత్‌షా 2023 మే 29న పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తగిన శ్రద్ధ వహించడంలేదు. మెయితీలు వారం క్రితం కూడా గిరిజనప్రాంతాల్లో గృహదహనాలను సాగించి, ముగ్గురు, నలుగురు గిరిజనులను చంపివేశారు. మెయితీలకు అనుకూలంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు కూడా వారిని కదిలించలేదు.
కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
తామునివసిస్తున్న ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కుకీ`జో గిరిజనులు అమిత్‌షాకు లేఖ రాశారు. రెండు జాతుల మధ్య ఇంకా హింసాయుత ఘర్షణలు కొనసాగుతున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘స్వదేశీ గిరిజన నాయకుల ఫోరమ్‌ (ఐటిఎల్‌ఎఫ్‌) స్థానిక మేజిస్ట్రేట్‌ ద్వారా లేఖను హోం మంత్రికి గత సోమవారం లేఖ పంపారు. రాజ్యాంగబద్దంగా ఆర్టికల్‌ 239(ఏ) కింద కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, రాజకీయంగా పరిష్కరించాలని, అసెంబ్లీ కూడా తమకు ఉండాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌పై చురచంద్‌పూర్‌లో భారీ ప్రదర్శన జరిపామని తమ లేఖలో పేర్కొన్నారు. సంవత్సరానికిపైగా హత్యలు, గరిజనులపై దాడులుసాగిస్తూ తమను తరిమి వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. శాంతి భద్రతలు ఇంకా మెరుగుపడలేదన్నారు. 200 మందికిపైగా గిరిజనులను చంపివేశారని, ఏడువేలకుపైగా ఇళ్లను ధ్వంసం చేశారని లేఖలో తెలిపారు. ఇటీవల జరిభమ్‌ ప్రాంతంలో 50కిపైగా ఇళ్లను, షాపులను తగులబెట్టారని ఆ మెమొరాండంలో తెలియజేశారు. నిత్యావసర వస్తువులు కూడా గిరిజన ప్రాంతాలకు రాకుండా నిరోధిస్తున్నారని తెలిపారు. మెయితీలకు రాష్ట్ర, కేంద్ర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. ఇంఫాల్‌వైపు వెళ్లడానికి కూడా అవకాశం లేదు. ఉద్యోగ అవకాశాలను ఇవ్వడంలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. సాయుధ దళాల అండతో తమ మీద దాడులు కొనసాగిస్తున్నారని, చంపడంలేదా తాము ఇళ్లువదలి వెళ్లిపోవాలని లక్ష్యంగా మెయితీలు ఉన్నారని తెలియజేశారు. కేంద్ర ఇప్పటికైనా మేల్కొని రాజకీయ పరిష్కారాన్ని చేయాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img