‘విశాలాంధ్ర అననీ
నమో నమో జననీ
పోరాడు వాడి గుండెబలం నీవె నీవె అననీ!
వెతలమారి బతుకు
రహస్యాలను వినిపించెరా
నేలబారు వాళ్ళను
నిలబడమని కదలించెరా
దోపిడీపై సమరానికి జనులను
నడిపించెరా ధనస్వామ్యపు
ధ్రుతరాష్ట్రపు కౌగిలి విడిపించెరా!
తెలుగు గుండె
సమైకృతారాగాలు ధ్వనించెరా వెలుగు
తాళ్ళుకట్టి తెలుగు వాళ్లనె బిగించెరా
తరతరాల జనసాహితి
విలువలు నిలబెట్టెరా
మనిషిని చితి చేర్చే
ధోరణులను పడగొట్టెరా
కులమతాల చీలికవాదంపై తొడగొట్టెరా
శ్రమజీవుల సహజీవన
సూత్రం పురిపెట్టెరా !
మహనీయుల త్యాగఫలం
అక్షరమై వెలగనీ అలుపెరుగని డెభ్భై రెండేడ్ల
పోరును కొనసాగనీ
అడుగడుగున వెంటనంటి
మేమే ఉన్నామనీ
పదేపదే అననీ విశాలాంధ్ర జననీ
- డా ఏటుకూరి ప్రసాద్