London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

సామరస్యానికి లాకు లెత్తండి!

వి. శంకరయ్య

ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సుగుణమేమంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు లేవు. కృష్ణా జలాల తగాదాలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొని ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తే సామరస్యానికి లాకు లెత్తడం అంత కష్టమేమీ కాదు. దుర్భిక్ష ప్రాంతమైన రాయల సీమతో పాటు దక్షిణ తెలంగాణలోని పెండిరగ్‌ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యం అవసరం. పైగా రెండు తెలుగు రాష్ట్రాలు తమలో తాము తగాదా పడకుండా బేసిన్‌లోని ఎగువ రాష్ట్రాల జల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడవలసి వుంది. కృష్ణ్ణాలో వున్న నీటిని సద్వినియోగం చేసుకోవలసి వుంది.
భారత దేశంలో గంగా బ్రహ్మ పుత్ర గోదావరి లాంటి పెద్ద నదులెన్నో వున్నాయి. కాని కృష్ణానది వీటన్నింటికీ మించి నీటి నిల్వ సామర్థ్యంలో ప్రథమ స్థానం సంపాదించుకొన్నది. అన్నీ వున్నాయి! అల్లుని నోట్లో శని వున్నదన్నట్లు ఈ వేసవిలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తాగునీటికి కూడా కటకటలాడ వలసి వచ్చింది . గంగానదిపై గల ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1718. 91 టియంసిలైతే కృష్ణానదిపై గల ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం

  1. 99 టియంసిలుగా వుంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు ఎగువ ప్రాంతం నుండి శ్రీ శైలం జలాశయానికి ప్రతి నీటి సంవత్సరంలో 459 టియంసిల నీళ్లు రావలసి వుండగా ఈ మే నెల 31 తో ఆఖరైన నీటి సంవత్సరంలో కేవలం 145 టియంసిల నీళ్లు మాత్రమే వచ్చాయని చెబు తున్నారు. కాని అంత క్రితం నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి 2040 టియంసిలు వచ్చాయి. సముద్రంలోనికి 1330 టియంసిలు పోగా మిగిలిన నీటినంతా వాడేశారు.
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి వాటా నికర జలాలు 811 టియంసిలు పోగా అదనంగా క్యారీ ఓవర్‌ కింద అనుమతించిన 150 టియంసిల నీటిని శ్రీశైలం, సాగర్‌, పులిచింతల రిజర్వాయర్లలో నిల్వ చేసుకొని వుంటే నీటి ఎద్దడి ఏర్పడిన మరు సంవత్సరంలో ఉదాహరణకు గడ్డు పరిస్థితి ఏర్పడిన ఈ ఏడు వాడుకొని వుండ వచ్చు. కాని ఇప్పుడే కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా క్యారీ ఓవర్‌ కింద నీటిని నిల్వ చేసిన ఒక్క సందర్భం లేదు. వచ్చిన నీరంతా వాడేశారు. మిగిలిన నీళ్లు సముద్రం పాలైనవి. గత గణాంకాలు వెలికి తీస్తే కృష్ణ్ణా డెల్టాలోనే గాక సాగర్‌ కుడి ఎడమ కాలువల కింద కూడా కేటాయింపులు కన్నా అధికంగా నీళ్లు వినియోగించినట్టు వెల్లడౌతుంది. మరో వేపు తుంగభద్ర నుండి రాయలసీమకు రావలసిన వాటాలో భారీగా కోత పడుతోంది. ఒక పక్క మెట్ట ప్రాంతమైన రాయల సీమ తాగునీటికి కూడా వెంపర్లాడుతుంటే నీటి యాజమాన్య లోపం వలన ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత ఇదే దుర్విధానం అమలు జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అయితే రెండు రాష్ట్రాలు కూడా ఒకరికొకరు పోటీపడి కింద భాగంలో అవసరం లేకున్నా శ్రీ శైలం జలాశయం నుండి విచ్చలవిడిగా నీళ్లు వదలిపెట్టడంతో వందల టియంసిలు సముద్రం పాలౌతున్నాయి. వరద రోజుల్లో నైనా రాయలసీమకు కృష్ణా నీళ్లు తరలించాలంటే సైంధవుడుగా తెలంగాణ అడ్డుపడుతోంది. పైగా సీమలో కాలువలు లేవు. రిజర్వాయర్లు అంతకన్నా లేవు. ఆది నుండి నేటి వరకు క్యారీ ఓవర్‌ అనే పదం నీటి పారుదల శాఖ డిక్షనరీలో లేకుండా పోయింది.
    మున్ముందు వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తాగునీటికీ కటకటలాడవలసి వస్తుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలు సామరస్యంగా వ్యవహరించి వుంటే క్యారీ ఓవర్‌ కింద నిల్వ చేయ గల స్థాయిలో 2023 లో వచ్చిన వరద నిల్వ చేసుకొని వుండవచ్చు. 2023 మే నెలతో ఆఖరైన నీటి సంవత్సరంలో క్యారీ ఓవర్‌ విధానం అమలు జరిపి వుంటే ఈ ఏడాది హైదరాబాద్‌ జంట నగరాల తాగునీటి కోసం సాగర్‌ నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించవలసిన దుస్థితి తప్పేది కాదా? ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలులోనికి వస్తే పరిస్థితి మరింత వికటించవచ్చు. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన నీళ్లు కూడా రాకపోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు తమలో తాము పోట్లాడుతూ వుంటే ఎగువ రాష్ట్ర ప్రభుత్వాలు కర్నాటక, మహారాష్ట్ర గత రెండేళ్లుగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై చేసుకొనేందుకు సుప్రీంకోర్టులో కేసు పరిష్కారానికి ఉమ్మడిగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల వేడి కుదటపడ్డ తర్వాత ఏదో ఒకరోజు త్వరలోనే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై జరగవచ్చు. అదే జరిగితే కృష్ణాలో ఇప్పుడున్న నీటి లభ్యత నుండి మిగులు పేర మరో 285 టియంసిల నీళ్లకు గండి పడబోతోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కెసి కెనాల్‌కు ఎగువ కాలువకు కేటాయించిన కేవలం ముప్పయి నలభై టియంసిలకే ఇన్నాళ్లూ తెలంగాణ (కెసిఆర్‌) పోరాడిరది. కానీ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అమలులోనికొస్తే వందల టియంసిలు ఎగువ రాష్ట్రాలు తన్నుకుపోతాయని గుర్తించ లేదని ఏలా భావించగలం?
    బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ సరాసరి కింద మిగులు జలాలుగా 285 టియంసిలుగా తేల్చి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు పంచింది. కృష్ణాలో మిగులు నీరంటూ చుక్క లేకుండా చేసింది. 65 శాతం నీటి లభ్యత కింద నికర జలాలు 65 టియంసిలు , మిగులు జలాల కింద 105 టియంసిలు మొత్తం 170 టియంసిలు ఒక్క కర్నాటకకు కట్టబెట్టింది. మహారాష్ట్రకు నికర జలాలు 43 టియంసిలు మిగులు జలాల కింద 35 టియంసిలు మొత్తం 78 టియంసిలు, కేటాయించినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నికర జలాల కింద కేవలం 39 టియంసిలు మిగులు జలాల కింద 145 టియంసిలు అదీ ఇందులో క్యారీ ఓవర్‌ కింద 150 టియంసిలు కేటాయించింది. క్యారీ ఓవర్‌ కింద కేటాయించిన 150 టియంసిలు ఎందుకూ పనికి రావు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలులోనికొస్తే దిగువ రాష్ట్రమైన తెలంగాణతో పాటు అవశేష ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వుంటుంది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అంశంలో ప్రతి సందర్భంలోనూ మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాలు ఒకటిగా వ్యవహరిస్తున్నాయి. కాని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిగా వ్యవహరించిన సందర్భం లేదు.
    ఈ పాటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్నేహ హస్తం అందించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ చూపవలసి ఉంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమలో తాము కీచులాట పక్కన పెట్టి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలు లోనికి వస్తే ముంచుకొచ్చే ప్రమాదం గ్రహించి సమిష్టిగా వ్యవహరించవలసి ఉంది.
    విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img