London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఖ్యాతి అపఖ్యాతి కలిసిన మొయిత్రా

పార్లమెంట్‌ కార్య కలాపాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలోనో, యూట్యూబ్‌ చానళ్లలోనూ చూసేవారికి మహువా మొయిత్ర గురించి తెలియకుండా ఉండదు. లోక్‌సభలో ఆమె ప్రసంగాలు చాలా వాడిగా ఉంటాయి. బెంగాలీ కుటుంబంలో పుట్టినప్పటికీ హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. 2019లో మొట్టమొదటిసారి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు ఆమె తొలి ప్రసంగంలోనే తన తాహతు ఏమిటో తెలియపరిచారు. ఈ దేశంలో ఏడు రూపాల్లో ఫాసిజం సాగుతోందని హెచ్చరించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఫాసిస్టు ఛాయలు గమనించిన వారికి మహువా మొయిత్రా హెచ్చరిక అవగతమై ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో న్యూయార్క్‌లో, లండన్‌ లో జె.పి. మోర్గాన్‌ బ్యాంకులో ఉన్నతోద్యోగం చేసిన మొయిత్రా ఆ తరవాత రాజకీయాల్లో ప్రవేశించారు. యూత్‌ కాంగ్రెస్‌లో పని చేశారు. అప్పుడు రాహుల్‌ గాంధీ ‘‘ఆమ్‌ ఆద్మీ కి సిపాహీ’’గా ఉన్నారు. ఆ తరవాత 2010లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. 2016 నుంచి 2019 దాకా బెంగాల్‌ శాసనసభ్యురాలిగా ఉన్నారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంలో మాట్లాడినప్పుడు ఆమె విమర్శ ఎంత పదునుగా ఉంటుందో మరోసారి అర్థం అయింది. ప్రతి ఎంపీ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కాని ఆ రాజ్యాంగానికే ముప్పు ఉందంటారు. 2021 ఫిబ్రవరి 8న లోక్‌సభలో మాట్లాడుతూ పవిత్రంగా ఉండవలసిన న్యాయవ్యవస్థ కూడా పవిత్రంగా లేదని అంగలార్చారు. రంజన్‌ గొగోయ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తన మీద లైంగిక అత్యాచారాల ఆరోపణలు వస్తే ఆ కేసును తానే విచారించి నిర్దోషినని ప్రకటించుకున్నప్పుడే న్యాయ వ్యవస్థ పవిత్రతకు భంగం కలిగిందంటారు. ఈ ప్రసంగంపై లోక్‌సభలో గగ్గోలు మొదలైంది. అధికారపక్ష సభ్యులు ఆమె మీద దుమ్మెత్తి పోస్తే ప్రతిపక్షాలు సమర్థించాయి. ఎందుకంటే ఆమె మాట్లాడిరది అక్షర సత్యం. అదానీని విమర్శించడంలో, మోదీకి, అదానీకి ఉన్న సాన్నిహిత్యం గుట్టు విప్పడంతో ఆమె మీద బీజేపీ దాడి పెరిగిపోయింది. అదానీ మీద విమర్శల్లో ఆమె రాహుల్‌తో పోటీ పడ్డారు. బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే, సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహద్‌ రాయ్‌ ఆమె మీద సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ ఎఫ్‌.ఐ.ఆర్‌. ప్రతిని లోక్‌సభ స్పీకర్‌కూ పంపించారు. ఆయన దానిని సభ నైతిక కమిటీ పరిశీలనకు పంపారు. అదానీ మీద దాడి చేయడానికి దర్శన్‌ హీరనందానీ నుంచి ఆమె డబ్బు ముట్టిందన్నది ఆ ఆరోపణల్లో ప్రధానాంశం. నైతిక కమిటీ విచారణ తంతు నడిపి ఆమెను సభ నుంచి బహిష్కరించాలని 2023 నవంబర్‌ 9న సిఫార్సు చేసింది. 2023 డిసెంబర్‌ 8న బహిష్కరణ తంతూ ముగిసింది. అప్పుడే ఆమె మళ్లీ కృష్ణ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై లోక్‌సభకు వస్తానని సవాలుచేసి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ఆమె మాట్లాడిన ప్రతి మాటా బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేసింది.సోమవారం నాటి ప్రసంగంలో ‘‘నారీ శక్తి గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం నిజానికి మహిళలను సహించలేరు. 17వ లోక్‌సభలో 78 మంది మహిళలు ఉండేవారు. అంటే 13.3 శాతం. ఈసారి మహిళల ప్రాతినిధ్యం 74 కు పడి పోయింది. మూడుకోట్ల మంది మహిళలను లక్షాధికారుల్ని చేస్తామంటున్నారు. కానీ బహు కోటీశ్వరుడైన ఒకే వ్యక్తిని మరింత సంపన్నుడిని చేస్తున్నారు’’ అని నిర్మోహమాటంగా చెప్పారు. ‘‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను మిథ్య కింద మార్చేశారు. అది ఎప్పటికో అమలులోకి వస్తుంది. మీకు మహిళలంటే భయం. నారీ శక్తి అంటే భయం’’ అని నిర్భయంగా ప్రకటించారు మొయిత్రా. ‘‘ఈశాన్య ప్రాంతానికి కేటాయింపులు నాలుగు రెట్లు పెంచామని రాష్ట్రపతి చెప్పారు. అందులో మణిపూర్‌ అన్న మాట ఎక్కడుంది? ఆ ప్రసంగంలో ఎక్కడా లేదు. ఎందుకు? ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ, ప్రధాని మోదీ ‘‘మ’’ అన్న అక్షరంతో మొదలయ్యే అనేక మాటాలు వాడారు. ముసల్మాన్‌, ముల్లా, మదర్సా, మటన్‌, మచ్లీ, మంగళ సూత్రం, ముజ్రా లాంటి మాటలు దొర్లించారు కానీ మణిపూర్‌ మాటే లేదు. ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంపై ఏం చేస్తుందన్న ప్రస్తావనే లేదు’’ అంటూ ఈశాన్య ప్రాంతాల వారిని ఆలింగనం చేసుకోవాలి అని అభ్యర్థించారు. ఆమె ప్రసంగం మొదలు పెట్టగానే మోదీ సభ నుంచి వెళ్లిపోవడం చూసి ‘‘నా మాటలు కూడా విని వెళ్లండి మోదీజీ’’ అన్నారు.
‘‘జమ్ము-కశ్మీర్‌ కు వర్తించే 370వ అధికరణాన్ని రద్దు చేశారు. లడాఖ్‌లో బీజేపీ మూడో స్థానంలో మిగిలిపోయింది. కశ్మీర్‌ లోని శ్రీనగర్‌, అనంతనాగ్‌, బరాముల్లాలో బీజేపీ పోటీ అయినా చేయలేని స్థితిలో పడిపోయింది. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు 370వ అధికరణం రద్దును వ్యతిరేకించిన వారికి ఓటు వేశారు’’ అని మొయిత్రా బీజేపీ అసలు స్వరూపాన్ని బయట పెట్టారు. ఆమె ఎన్నికల కమిషన్‌నూ వదలలేదు. ‘‘ఎన్నికల కమిషన్‌ ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ప్రతిపక్షం బలం పుంజుకుంది. ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేష ప్రసంగాలను చూసి దేశవాసులు సిగ్గుతో తల దించుకున్నారు’’ అని గొంతెత్తి మాట్లాడారు మొయిత్రా. ‘‘అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి బుల్లెట్‌ రైలు కోసం రూ. 1,08, 000 కోట్లు కేటాయించారు. అత్యంత వేగంగా వెళ్లే ఒక కిలోమీటర్‌ రైలు నిర్మాణానికి రూ. 200 కోట్లు ఖర్చవుతాయి. రైళ్లు ఢీ కొన కుండా కవచ్‌ సదుపాయం ఏర్పాటు చేయడానికి కి.మీ.కు రూ.50,00,000 ఖర్చు అవుతుంది. అంటే దీనికి మొత్తం ఖర్చయ్యేది 63,000 కోట్లు మాత్రమే. బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని 296 మంది మరణించారు. గత వారం కాంచన్‌ గంగ రైలు ప్రమాదంలో 10 మంది మరణించారు. కవచ్‌ ఉంటే ఈ ప్రమాదాలను నివారించగలిగే వాళ్లం. కాని దీనికోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను బట్టి దేశమంతా కవచ్‌ అందుబాటులోకి రావడానికి 50 ఏళ్లు పడ్తుంది. ఇది విశ్వగురువు నిర్వాకం’’ అని మహువా మొయిత్రా మాత్రమే అనగలరేమో! ‘‘బెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ లో మోదీ ప్రచారం చేసిన అన్ని నియోజక వర్గాల్లో బీజేపీ ఓడి పోయింది. రాజస్థాన్‌ లో 14 సీట్ల దగ్గర చతికిల పడి పోయింది. అయోధ్య రామ మందిరం నిర్మించిన చోటే ఫైజాబాద్‌ లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడమే కాదు ఆ చుట్టుపక్కల కూడే అదే గతి పట్టింది’’ అని ఆమె తప్ప ఎవరు అనగలరు. ` అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img