London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

నిజం చెప్పినందుకు అసాంజే క్షోభ

పధ్నాలుగేళ్ల పాటు బ్రిటన్‌, అమెరికా ప్రభుత్వాల పీడనకు గురైన వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియస్‌ అసాంజే ఎట్టకేలకు స్వేచ్ఛా జీవి కాబోతున్నాడు. ఆయన ఒక ప్రైవేటు విమానంలో పసిఫిక్‌ మహాసముద్రం మధ్యలోని అమెరికా భూభాగం నుంచి ఆస్ట్రేలియాకు బయలు దేరాడు. ఈ ప్రయాణానికి ఆయనకు పది లక్షల డాలర్లు ఖర్చు అవుతాయి. అంత డబ్బు భరించే ఆర్థిక స్తోమత ఆయనకు లేదు. కానీ ఆయన కుటుంబం సభ్యులు జనం దగ్గర విరాళాలు వసూలు చేసి ఆయన విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వాల బండారం బయట పెట్టినందుకు ఇంత సుదీర్ఘకాలం వేదన అనుభవించిన పత్రికా రచయిత మరొకరు లేకపోవచ్చు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం అని చెప్పుకునే అమెరికా ప్రభుత్వ అవకతవకలను సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టినందుకు ఆయన ఇంత పీడన, వేదన భరించవలసి వచ్చింది.
స్వేచ్ఛా జీవి కావడానికి ఆయన ఒక నేరం చేశానని అంగీకరిస్తే తప్ప విడుదల సాధ్యం కాలేదు. 1917 నాటి కాలదోషం పట్టిన అమెరికా గూఢచార చట్టం ప్రకారం ఆయన మీద నిరాధారమైన ఆరోపణలు మోపారు. యాభై రెండేళ్ల అసాంజే ఈ నేరం చేసినట్టు ఒప్పుకోవలసి వచ్చింది. తాను పొరపాటు చేసినట్టు ఒప్పుకోక తప్పలేదు. అమెరికా, ఇంగ్లాండ్‌ లాంటి పాశ్చాత్య దేశాలు ఎంత క్రూరంగా ప్రవర్తించగలవో అసాంజే ఉదంతం రుజువు చేస్తోంది. అసాంజే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌లోని అత్యంత భద్రతగల బెల్మార్ష్‌ జైలులో అయిదేళ్ల రెండు నెలలు ఉండాల్సి వచ్చిందో డా.నిల్స్‌ మెల్జర్‌ ‘‘ది త్యయల్‌ ఆఫ్‌ జూలియన్‌ అసాంజే’’ గ్రంథంలో వివరించారు. రెండు మీటర్ల వెడల్పు, మూడు మీటర్ల పొడవు ఉన్న చిన్న జైలు గదిలో ఆయన ఏకాంత జీవితం గడపవలసి వచ్చింది. అందువల్ల ఆయన మానసిక స్థితితోపాటు శారీరకంగా కుంగి పోవాల్సి వచ్చింది. అసాంజేను చిత్రహింసలు పెట్టిన తీరు గమనిస్తే ఇటలీ ఫాసిస్టు పాలకుడు ముస్సోలినీ ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి గ్రాంసీ మెదడు పని చేయకుండా చూడాలని జైలు సిబ్బందిని ఆదేశించిన కిరాతక వైనం గుర్తొస్తుంది. బెల్మార్ష్‌ జైలులో ఉండడానికి ముందు అసాంజే లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో నిర్బంధ జీవితం గడపవలసి వచ్చింది. బయటకు అడుగుపెడ్తే ఎవరు ఎప్పుడు చంపేస్తారోనన్న భయం పీడిరచింది. ఆ తరవాత ఆయనను అరెస్టుచేసి అమెరికా పంపించారు. ఆయనగనక ఇప్పుడు విడుదల కాకపోతే 175 ఏళ్ల పాటు జైలు శిక్ష పడేది. నిర్భీతిగా పత్రికా రచన కొనసాగించడమే ఆయన చేసిన నేరం. ఇప్పటికైనా అసాంజే విడుదలయ్యే వారు కాదు. అమెరికాలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువల్ల బైడెన్‌ ప్రభుత్వం మానవ హక్కుల విషయంలో తాము కడిగిన ముత్యం లాంటి వాళ్లమని ప్రపంచాన్ని నమ్మించడానికి మాత్రమే విడుదల చేసింది. ఇప్పటికే పలస్తీనియన్ల మీద ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న అమానుష యుద్ధానికి మద్దతు ఇస్తున్నందుకు అమెరికా బోలెడు విమర్శలు ఎదుర్కుంటోంది. తాను చట్ట విరుద్ధంగా సమాచారం సేకరించినట్టు అంగీకరిస్తే వదిలేస్తామని గత 24వ తేదీన అమెరికా న్యాయ మంత్రిత్వశాఖ బేరం పెట్టింది. దీని ప్రకారం అమెరికా అసాంజేకు అయిదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కాని ఆయన బెల్మార్ష్‌ జైలులో శిక్ష అనుభవించినందువల్ల ఆ కాలాన్ని శిక్ష అనుభవించినట్టు భావించి ‘‘దయ’’ చూపారు. అందుకే ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్‌ అసాంజేను నెలవు వదిలిన పక్షిగా అభివర్ణించారు. ఆంగ్లో అమెరికన్‌ సామాజ్రవాదుల అకృత్యాలను అసాంజే బహిర్గతం చేసిన ఉదంతం అసాధారణమైంది. దానికి ఆయన ఎవరూ చెల్లించని మూల్యం చెల్లించవలసి వచ్చింది. 2006లో ఆయన వికీలీక్స్‌ ప్రారంభించి నప్పటి నుంచి ఇలాంటి అకృత్యాలను బయటపెట్టే పనిలోనే ఉన్నారు. అమెరికా శ్వేతసౌధం దాచేసిన నిజాలను వెల్లడిరచారు. ఇవి ఒక ప్రభుత్వానికి పరిమితమైనవి కావు. ఇరాకీ పౌరుల మీద అమెరికా యుద్ధ విమాన పైలెట్‌ నిర్దాక్ష్షిణ్యంగా ఎలా బాంబుల వర్షం కురిపించాడో అసాంజే వీడియోతో సహా బహిర్గతం చేశారు. దీనికి ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌కు సంబంధించిన అనేక రహస్య పత్రాలను వెలికి తీశాడు. అమెరికా దాడిలో రాయిటర్స్‌ పత్రికా రచయిత మరణించిన వాస్తవాన్ని అసాంజే బయట పెట్టాడు. గౌటెనామా బేలో 15,000 వేలమంది పౌరుల ప్రాణాలు బలి తీసుకున్న విషయాన్ని బయటపెట్టారు. అమెరికా గూఢచార సంస్థ నేషనల్‌ సెక్యురిటీ ఏజెన్సీ జపాన్‌, జర్మని ప్రభుత్వాల అధికారుల మీద గూఢచర్యం ఎలా కొనసాగించిందో అసాంజే రుజువు చేశారు. వికీలీక్స్‌ విడుదల చేసే వార్తలను ఇంగ్లాండ్‌ లోని గార్డియన్‌, అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ అప్పుడు దర్జాగా వాడుకుని గొప్ప పరిశోధనాత్మక వార్తలు వెలికి తీసినట్టు బుజాలు ఎగురవేశాయి. తీరా అసాంజే చిక్కుల్లో పడ్డప్పుడు ఈ పత్రికలు వాటంగా తప్పించుకున్నాయి. కాడి కింద పడేశాయి. అసాంజే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అసాంజే మీద నిరాధారంగా లైంగిక అకృత్యాలకు పాల్పడినట్టు స్వీడన్‌ లో కథ కూడా అల్లి ప్రచారంలో పెట్టారు. అంటే అసాంజే వివిధ ఖండాల్లో శిక్ష, పీడన అనుభవించడమే కాక ఎన్నో దేశాలు మోపిన ఆరోపణలు భరించవలసి వచ్చింది. ఇదంతా కట్టు కథ అని తరవాత ఫారెన్సిక్‌ దర్యాప్తులో తేలిపోయింది. నిజానికి అసాంజేను అత్యాచారా లకు పాల్పడేవాడిగా చిత్రించడానికి అమెరికా పాలనా కేంద్రమైన వైట్‌హౌజ్‌, ఇంగ్లాండ్‌ లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ఈ కుట్ర చేశాయి. అసాంజే రష్యా తొత్తు అని, డోనాల్డ్‌ ట్రంప్‌ తో కుమ్మక్కై అమెరికా మీద నిందలు వేస్తున్నాడని 2016లో అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీపడ్డ హిల్లరీ క్లింటన్‌ కూడా ఆరోపించారు. ఈ దుష్ప్రచారానికి వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ లాంటి పత్రికలు మరింత ఆజ్యం పోశాయి. ప్రపంచ వ్యాప్తంగా నిష్పక్షపాత పత్రికా రచనకు మద్దతిచ్చేవారు అసాంజేకు అండగా నిలవకపోతే ఆయన జైలు గోడల మధ్య శారీరకంగా కృశించి, మానసికంగా ఎందుకూ కొరగా కుండా తయారై ప్రాణాలు వదలాల్సివచ్చేది. మానవ హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడిన న్యాయవాదులు, పత్రికా రచయి తలు, మేధావులు అసాంజే మీద జరుగుతున్న దాడిని నిరంతరం వ్యతిరేకిం చినందువల్లే అసాంజే విడుదల సాధ్యం అయింది. ఆయన ఎదుర్కున్న వేదన స్వేచ్ఛాయుత దేశాలలో వాస్తవ పరిస్థితికి దర్పణం. అయితే ఆ దర్పణం పగిలి పోయింది. అందులో ఆ దేశాల ముఖ చిత్రాలు కకావికలై కనిపిస్తున్నాయి.
` అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img