London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పాలనలో ప్రజాభిప్రాయమే మిన్న

సుంకవల్లి సత్తిరాజు

ప్రజాస్వామంలో అధికారం శాశ్వతం కాదన్న సత్యాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు మరో మారు చాటి చెప్పాయి. ప్రజాభీష్ఠానికి తలొగ్గాలని, ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలని ఈ ఎన్నికల ద్వారా సుస్పష్టమైంది. కొన్ని పార్టీలను అధికారానికి దూరంచేసి, మరికొన్ని పార్టీలకు మెజారిటీలను తగ్గించడం ద్వారా భారతీయులు తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిధ్వనింప చేసారు.అహంకారం, నియంతృత్వం ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధం. ఈ రెండు అవలక్షణాలు రాజకీయాల్లోకి చాప కింద నీరులా వచ్చి చేరాయి. తత్ఫలితంగానే రాజకీయం ఒక రణరంగంగా పరివర్తన చెందింది. పదవులు శాశ్వతమని భ్రమించి, ప్రత్యర్ధులను వేధించడం వలన జరిగే పరిణామాలు ప్రజా జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. శతాబ్దాల తరబడి సాగిన పరాయి పాలకుల ఏలుబడిలో నలిగి నుజ్జయిన భారతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతో మంది మహనీయుల స్వార్ధమెరుగని సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తిరిగి ఊపిరి పోసుకున్నాయి. మన ఊపిరి కోసం తమ ఊపిరిని ఉరికంబ మెక్కించిన వీరుల త్యాగాలకు ప్రతిరూపమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. అయితే నాటి వీరులు మన కందించిన పోరాట స్ఫూర్తి ఏమైపోతున్నదని ప్రశ్నించుకుంటే రాజకీయ రావణకాష్ఠంలో దగ్ధమె ౖపోతున్నదని సమాధానం వస్తుంది. వర్తమాన రాజకీయాలు హుందాతనం కోల్పోతున్నాయి. ప్రశాంతంగా సాగవలసిన ప్రజాజీవితాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. రాజకీయాలు ప్రజలమధ్య కార్చిచ్చు రగిలిస్తు న్నాయి. రాజకీయాల పేరుతో ప్రజలు కుల, మత, ప్రాంత వర్గాలుగా విడిపోతున్నారు. అయితే ఎక్కడో ఒక చోట ప్రజాస్వామ్య స్ఫూర్తి అగుపిస్తున్నది. ప్రజాస్వామ్య పునాదులు ధ్వంసం కాకుండా పోరాటం జరుగుతున్న భావన కలుగుతున్నది. ప్రజా చైతన్యం పెల్లుబికి, రాజకీయాలు శాశ్వతం కాదని, అధికారం ప్రజల విచక్షణపై ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని నిరూపిస్తున్నాయి. ప్రజలు బానిసలు కారని, పాలకులు ప్రజాస్వామ్యాన్ని హరిస్తే ప్రజలు ఎదురు తిరిగి, తమ ఓటుహక్కు ద్వారా గుణపాఠం చెబుతారనే సత్యాన్ని పాలకులు గుర్తించాలి. ఎంతో మంది నాయకులు ఈ దేశాన్ని పాలించారు, పాలిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజాభీష్ఠానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, అలాంటి వారిని ఎన్నికల్లో ఓటుహక్కు ద్వారా మార్చగలిగే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనమున్నాం. అయినప్పటికీ అధికారం శాశ్వతమని భ్రమించే ధోరణి మాత్రం రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంది. ఐదేళ్లు, పదేళ్లు భరించి, ప్రజలు పాలకులను మార్చేస్తున్నారు. ఒక్కోసారి మెజారిటీ ని తగ్గించి పాలకుల దూకుడుకు పగ్గమేస్తున్నారు. ఇటీవల జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల ప్రదేశ్‌, సిక్కిం శాసన సభలకు జరిగిన ఎన్నికలు భారతీయుల ప్రజాస్వామ్య స్ఫూర్తిని, పోరాట పటిÄమను ప్రతిబింబింప చేసాయి. ఓటు వేయడానికి ఆసక్తి చూపని పరిస్థితుల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్‌ శాతం రికార్డు సృష్టించింది. భారత దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకుని ప్రపంచ రికార్డును సృష్టించారు. ఎన్నికల ఫలితాలు కూడా అధికారం శాశ్వతమని భ్రమించిన నాయకులకు కనువిప్పు కలిగించాయని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతోమంది నాయకుల ఆశలను తల్ల క్రిందులు చేసాయి. ప్రజాభీష్ఠాన్ని గౌరవించని పాలకులను ఇంటికి సాగనంపాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ప్రజాతీర్పు పాలకులకు వ్యతిరేకంగా రావడం, సంస్కరణ వాదిగా పేరొందిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైలు పాలైనప్పటికీ, ప్రజల్లో అంతగా సానుభూతి కానరాకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల విచక్షణాశైలిని సూచిస్తున్నది. ప్రజల నాడిని సరిగ్గా అంచనా వేయని సర్వే సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్ధకమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒకటి రెండు సర్వే సంస్థలు కచ్చితమైన గణాంకా లను ప్రకటించడం విశేషం. ఏది ఏమైనప్పటికీ తప్పుడు గణాంకాలతో ప్రజలను బెట్టింగులకు పురిగొల్పి, లక్షలు, కోట్లు నష్ట పోయేలా, ఆస్తులు కోల్పోయేలా చేస్తూ, జీవితాలను తల్లకిందులు చేస్తున్న సర్వే సంస్థలపై చర్యలు తీసుకోవాలి. భారత దేశంలో ఏడుదశల్లో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తించింది. ఇ.వి.ఎం లలో నిక్షిప్తమైన ప్రజాభిప్రాయం బహిర్గతం కావడానికి చాలా రోజులు వేచి చూడవలసి వచ్చింది. పాలకులుతమ ప్రయోజనం కోసమే ఏడు దశల్లో ఎన్నికలు జరిపారని ప్రజలు తెలుసుకుని తగు విధంగా స్పందించారు.
` సెల్‌: 9704903463

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img