Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

బీజేపీ వెన్నులో వణుకు

కళ్యాణీశంకర్‌

ఇటీవల ఏడు రాష్ట్రాలలో 13 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో 10సీట్లు ఇండియా ఐక్యసంఘటన గెలవడంతో బీజేపీ వెన్నులో వణుకు పుడుతోంది. అంతేకాదు, మిశ్రమ ప్రభుత్వం మనుగడ సాగుతుందా? అని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సీట్లు బీజేపీ గెలుచుకోలేదు. 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. టీడీపీ(16) జేడీ(యు) (12) సహకారంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా సంకీర్ణప్రభుత్వం ఏర్పడిరది. ప్రభుత్వం ఏర్పడి గట్టిగా నెలరోజులకుపైగా గడిచింది. 13 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు మాత్రమే గెలుచుకోవడం, ఇండియా ఐక్యసంఘటన పదిసీట్లలో విజయం పొందడమే ఆందోళనకు ప్రధాన కారణం. ఒక సీటు ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలిచారు. ఇండియా ఐక్యసంఘటన బలపడుతుండగా, బీజేపీ బలహీనమవుతోంది. సంకీర్ణప్రభుత్వానికి తోడ్పాటిచ్చిన పార్టీలను ఖాతరు చేయకుండా గత పదేళ్లు సాగించిన మోదీ నిరంకుశ ప్రభుత్వం అలాగే కొసాగే అవకాశం ఉండకపోవచ్చు. సంకీర్ణప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందా అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా ఐక్యసంఘటన బలపడేకొద్దీ ప్రభుత్వ సుస్థిరతపై అనిశ్చితిని వ్యక్తం చేస్తున్నారు. సంకీర్ణప్రభుత్వానికి మద్దతునిచ్చే పార్టీలతో సంప్రదించకుండా విధానాలు రూపొందించేందుకు వెనుకాడవచ్చు. అయితే ఇంతవరకు గతంలో అనుసరించిన నిరంకుశ పోకడలే కొనసాగిస్తున్నారు. ఖాళీ అయిన13 సీట్లకు ఉప ఎన్నికలను పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్‌ చెప్పడం మామూలే. పార్లమెంటు సీట్లకు రాజీనామా చేయడం, చనిపోవడంలాంటి కారణాలవల్ల ఉప ఎన్నికలు జరపవలసి వచ్చింది. పంజాబ్‌లో (1), హిమాచల్‌ప్రదేశ్‌ (3), ఉత్తరాఖండ్‌(2), పశ్చిమబెంగాల్‌లో(4), మధ్యప్రదేశ్‌లో(1), బీహార్‌లో (1), తమిళనాడులో(1), ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌, డీఎంకేలు పోటీలో గెలుపొందాయి.
కాంగ్రెస్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకటి, ఉత్తరాఖండ్‌లో ఒకటి`రెండు సీట్లు గెలుచుకుని ఆ రాష్ట్రాలలో బలంపుంజుకుంది. డీఎంకె ఒకటి, ఆప్‌ జలంధర్‌ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచాయి. రాజకీయ పార్టీల బలాబలాలలో మార్పులు రావచ్చునని ఇవి సంకేతాలనిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికల్లో 29సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగుస్థానాలు గెలుచుకుని మరికొంత బలాన్ని పెంచుకుంది. బీజేపీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కంటే చాలా వెనకబడిఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 22స్థానాలు గెలుచుకున్న టీఎంసి ఈ 29సీట్లు గెలుచుకుని బలంపెంచుకుంది. ఉత్తరాఖండ్‌, బీహార్లలో పరిస్థితివేరు. బీహార్‌లో పాలక బీజేపీ, జేడీ(యు)లు ఉప ఎన్నికల్లో ఓడిపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు స్థానాలకుగాను రెండుసీట్లు గెలుచుకుంది. ఫలితాల అనంతరం హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 సభ్యులుండే అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 40కి పెరిగింది. ఇది రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరతను మెరుగుపరచింది. ఉప ఎన్నికలు ఆయా పార్టీల పలుకుబడిని తెలియజేసింది. ప్రజల ఆలోచనాధోరణులు ఎలా ఉన్నాయనే విషయం తెలియజేసింది. ఉప ఎన్నికల్లోనూ గెలుపొందితే అధికారంలో పార్టీ పరిస్థితి మెరుగైందని భావించవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీల ఉప ఎన్నికల్లోనూ గెలుపొందితే అధికారంలో పార్టీ పరిస్థితి మెరుగైందని భావించవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ పలకుబడి క్రమంగా తగ్గుతోందని భావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల మధ్య దూరం పెరగడం వల్ల ఆ పార్టీ ఎన్నికల ఫలితాల్లో గెలుచుకున్న సీట్ల సంఖ్య తగ్గిందని చెప్తున్నారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, ఇండియా ఐక్యసంఘటన పరిస్థితి మెరుగైనందున, ఇకపైన కూడా ఐక్యంగా కృషిచేసి మరింత బలపడాలని కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు.
త్వరలో మహారాష్ట్ర,హర్యానా,జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలలో ఇండియా ఐక్య సంఘటన పరిస్థితి మెరుగ్గా ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ఎన్నికల్లో గెలుపొందితే ఇండియా ఐక్య సంఘటన పరిస్థితులు మరింతగా బలపడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img