London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

మాతృభాషలో బోధించాలి

హరి వెంకట రమణ
విద్య అసలు లక్ష్యం సమాధానాలను అందించడం కాదు, ప్రశ్నలను సంధించడం అంటారు అమెరికన్‌ రచయిత, ఉపాధ్యాయురాలు హెలెన్‌ కెల్లెర్‌. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాలపై అనేక ప్రశ్నలు, కావలసిన సమాధానాలు వెతకవలసిన సమయం. ఐదేళ్ల సంస్కరణల్లో మంచి చెడూ చర్చించి ఇప్పుడు చేయవలసిన దిద్దుబాట్లు గురించి చర్చించడం అవసరం. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక రెండు ముఖ్య విషయాలు అందరూ చర్చించారు. దీనిపై తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అవి ఒకటి మెగా డీఎస్సీపై సంతకం, రెండు విద్యా దీవెన కింద పిల్లలకు ఇచ్చిన స్కూల్‌ బ్యాగులపై గత ముఖ్యమంత్రి బొమ్మ వున్నా వాటిని కొనసాగించమనడం.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం అనేది దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం మొదటగా 2015 లో ప్రారంభించింది. దీనిని ‘‘దిల్లీ విద్యా విప్లవం’’గా అభివర్ణించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. స్కూళ్లకు మంచి రంగులు, పిల్లలకు సరిపడా ఫర్నిచర్‌, మార్గదర్శకులైన గురువులు, గణనీయమైన మార్కులు ఈ విద్యాసంస్కరణల ప్రధాన ఉద్దేశంగా చెపుతారు. పిల్లలకు ప్రాధమిక స్థాయి నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో బోధనతో కూలీ నాలీ చేసుకొని ప్రైవేటుబడుల్లో చేర్చే తల్లి తండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం మొదలు పెట్టారు. విద్యార్థులకు వారి మాతృభాషలో బోధించినప్పుడు, పిల్లలు సులభంగా అర్ధం చేసుకొంటారు అది నిర్వివాదాంశం. కానీ తల్లి తండ్రుల ఇంగ్లీష్‌ బోధనా ఆసక్తులు, కోరికలు కూడా పరిగణనలోకి తీసుకొని ప్రాథóమిక స్థాయి నుంచి తెలుగు ఇంగ్లీష్‌ రెండు మాధ్యమాలు తప్పనిసరిగా ఉంచాలి. విద్య ఉమ్మడి అంశం కనుక కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానాన్ని శరవేగంగా అమలు చేయవలసిన అవసరంలేదు. జాతీయ విద్యావిధానం, 2020 ప్రకారం ‘‘ప్రస్తుత నేర్చుకునే ఫలితాలు, కావాల్సిన వాటి మధ్య అంతరాన్ని చిన్ననాటి విద్య నుంచి ఉన్నత విద్య ద్వారా వ్యవస్థలోకి అత్యధిక నాణ్యత,సమగ్రతను తీసుకురావడానికి స్థూల స్థాయి సంస్కరణలను చేపట్టాలి. జాతీయ విద్యా విధానం, ఎర్లీ చైల్డ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌, ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీపై నేర్చుకునేందుకు, విద్యా వ్యవస్థలో సమర్థవంతమైన వనరులు, పాలన ఆవశ్యకతపై పూర్తి దృష్టి సారించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకు బదిలీ చేయడంతో ప్రాథóమిక స్థాయి విద్యార్థులకు కావలసిన ఫౌండేషన్‌ స్థాయి బోధన సంక్షోభంలో పడిరది. ఇందువలన చిన్న పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హై స్కూల్‌, ప్లస్‌టులో గత విద్యా సంవత్సరంలో చాలా నాసిరకం ఫలితాలు వొచ్చాయి. వీటికంటే ఇంటర్మీడియేట్‌ కళాశాలలు మరిన్ని అందుబాటులో ఉంచడం, లేదా వీటిలో నైపుణ్యం గల లెక్చరర్లను నియమించడం మంచిది. ప్రాథమిక పాఠశాలలను, కిలోమీటర్‌ పరిధిలోని పాఠశాలలను అలాగే ఉంచాలి. నాలుగు, అయిదు తరగతులను హై స్కూల్‌లో విలీనం చేయకూడదు. ఇందువలన చిన్న పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. అలాగే హైస్కూల్‌, ప్లస్‌ టు లో గత విద్యా సంవత్సరంలో చాలా నాసిరకం ఫలితాలు వొచ్చాయి. వీటికంటే ఇంటర్మీడియేట్‌ కళాశాలలను మరిన్ని అందుబాటులో ఉంచడం, లేదా వీటిలో నైపుణ్యంగల లెక్చరర్లను నియమించడం మంచిది. ఇక సీబీఎస్‌సీ అమలు విషయానికొస్తే దేశంలో బహుశా ఆంధ్రప్రదేశ్‌ మొదటి రాష్ట్రం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి పాఠశాలల్లో ఎనిమిదవ తరగతితో ప్రారంభమయ్యే గత విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను రూపొందించారు. ఈ వ్యవస్థ 2024-25లో పదవ తరగతికి విస్తరణ అవుతుంది. ఈ ప్రయత్నం మంచిదే కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ విధాన అమలుకు మరిన్ని మెరుగైన మార్గాలను అన్వేషించాలి. అమలుకు కొత్త ప్రణాళికలు రూపొందించాలి. సీబీఎస్‌సీ సిలబస్‌ బోధించడానికి నైపుణ్యాలు గల ఉపాధ్యాయులను ఎంపిక చేయాలి. ఇప్పటికే కొనసాగుతున్న ఉపాధ్యాయులకు మరిన్ని నైపుణ్యాలను సమకూర్చాలి. వివాదాస్పదమైన బైజూస్‌ కంటెంట్‌్‌తో కూడిన 5,18,740 ట్యాబ్‌లను ఉపాధ్యాయులతో పాటు 4.59 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడానికి దాదాపు రూ.686 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇందుకు బదులుగా రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీి) పాఠ్యాంశాల ఆధారిత డిజిటల్‌ సామాగ్రిని రూపొందిస్తే మంచిది. దీనికి స్థానిక రచయితలను, చిత్రకారులను, యానిమేటర్లను వినియోగిస్తే కంటెంట్‌లో స్థానికత కనిపిస్తుంది. విద్యార్థులు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు.
ఉపాధ్యాయులకు యాప్‌ల పనిభారం తగ్గించి పూర్తి సమయం బోధనకు, పాఠ్యాంశాల ప్రణాళికకు, కృత్యాల ఆధారంగా బోధించడానికి సమయం ఇవ్వాలి. సమగ్ర శిక్షణ కనెక్ట్‌ టు ఆంధ్ర, సేవ్‌ ద చిల్డ్రన్‌ సాంకేతిక సహకారంతో ఏర్పాటవుతున్న స్టెమ్‌ ( సైన్స్‌ టెక్నాలజీ, ఇంగ్లీష్‌, మాథమాటిక్స్‌ ) లాబొరేటరీల సద్వినియోగం ద్వారా విద్యార్థులకు క్లిష్టమైన పాఠ్యంశాలను అనుభవాత్మక విద్య ద్వారా బోధనను అత్యంత సులభతరం చేయవచ్చు. పిల్లల కోసం పనిచేసే సంస్థలు సదుద్దేశంతో ప్రారంభించిన లెర్నింగ్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రోగ్రాం(లిప్‌) ఇస్తున్న మంచి ఫలితాలు మదింపు చేసి, ఇది మరింత మెరుగ్గా ఎలా చేయగలమో ఆలోచన చేయాలి. ఆసెర్‌ ( యాన్యువల్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ) 2023 లో ఇచ్చిన బియాండ్‌ బేసిక్స్‌ అనే నివేదిక చూస్తే దాదాపు 25శాతం మంది ఇప్పటికీ తమ ప్రాంతీయ భాషలో రెండో తరగతి స్థాయి వచనాన్ని సరళంగా చదవలేరు. అంకగణితం, ఆంగ్ల పఠనంలో ఇస్తున్న నివేదిక చూస్తే మన పిల్లల విద్యా నైపుణ్యాలు చాలా తక్కువ స్థాయిలో వున్నాయి, అలాగే ప్రపంచ బ్యాంకు లెర్నింగ్‌ పావర్టీ ఇండెక్స్‌ ప్రకారం, భారతదేశంలోని 55 శాతం మంది పిల్లలు ఈ రోజు ప్రాథóమిక వయస్సు చివరిలో చదవడంలో నైపుణ్యం కలిగిలేరు. ఈ ఫలితాలలో మన పిల్లలూ వున్నారు.
ఇక భాషా నైపుణ్యాలు మా క్షేత్రస్థాయి పరిశీలనలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పదవతరగతి చేరుకున్నా తెలుగు, ఇంగ్లీష్‌ తప్పులు లేకుండా రాయడం రావటం లేదని తేలింది. భాష పునాది మీదనే మిగతా విద్య అంతా ఉంటుంది. ఇంత బడ్జెట్‌ కేటాయించి, టీచర్లను ఏడిపించి, పాఠశాలలను మూసివేసి, పిల్లల విద్యపై సాధించినది ఏమిటి ? మొదటి తరగతిలో ఉత్తీర్ణత, రాంకులు సంగతి సరే. నిజమైన విలువలతో కూడిన విద్య అందుతుందా ? లేదా ఇంత శ్రమా బూడిదలో పోసిన పన్నీరేనా ? ఆలోచించి ప్రాథమిక స్థాయి నుంచి వీటిని సరిదిద్దాలి. లేదా ఈ పిల్లలు ఇలాగే ఇంటర్లు, డిగ్రీలు పూర్తిచేసి అక్షర దోషాలతో రాస్తుంటారు. గత ప్రభుత్వం కేవలం కొంతమంది అధికారుల మాటలతోనే విద్యా సంస్కరణలు చేపట్టింది, పిల్లల వాస్తవ అవసరాలు ఏమిటి ? వారి ఆసక్తులు ఏమిటి ? ఈ రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలు ఏం చెపుతున్నారు ? అని అడిగిన వారు, విన్నవారు వున్నారా ? కానీ మన సమాజంలో అన్ని రకాల పిల్లలూ వుంటారు, అందరినీ పాఠశాల గొడుగులోకి తేవడం అందరి బాధ్యత.
భారత ప్రభుత్వ జాతీయ యువజన అవార్డు గ్రహీత
సెల్‌: 9866084124

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img