London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

శ్రమజీవుల పాశుపతాస్త్రం…

నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న)
నేను విశాలాంధ్ర పత్రికకు ప్రారంభం నుంచీ అంటే 1952 నుండి పాఠకుడిని, తెలుగు పత్రికా రంగంలో అద్వితీయమైన చరిత్ర కలిగినది. విశాలాంధ్ర, ఇది నేను కమ్యూనిస్టుగా అనటం లేదు. పరిశీలన చేస్తే ఇది ఎవరికైనా అవగతమవుతుంది. ఆ రోజులలో తెలుగు దినపత్రికలు కొన్ని ఉన్నా, అవి మద్రాసులో అచ్చవుతుండేవి. తెలుగు ప్రజల సాంస్కృతిక కేంద్రం విజయవాడ నుంచి ప్రింటైన తొలి తెలుగు దినపత్రిక విశాలాంధ్ర. లాభాపేక్ష లక్ష్యం కాకుండా, ఒక వ్యక్తి నిర్వహణలో కాకుండా, ప్రజల పక్షాన కొన్ని లక్ష్యాలతో, సమష్టి యాజమాన్యం నిర్వహిస్తున్న దినపత్రిక విశాలాంధ్ర. సుదీర్ఘకాలంగా, నిరాటంకంగా, నిర్విరామంగా (72 సంవత్సరాలు పాటు) నడిచిన, ఇంకా నడుస్తున్న పత్రిక విశాలాంధ్ర. ఆఫీసులలో, పరిశ్రమలలో, పంట పొలాలలో పనిచేస్తేనే జీవనం గడివే ప్రజలు, శ్రామికులు (సుమారు 80 శాతం మంది) ఎవరైతే ఉన్నారో వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చే పత్రిక విశాలాంధ్ర. వారి ఉద్యమాలకు వెన్నంటి ఉండి, వారి పోరాటాలకు బాసటగా నిలిచి ఊపిరి పోస్తూ నిత్యం మీకు నేనున్నానంటూ ముందుకు నడిపించే శ్రమజీవుల పాశుపతాస్త్రం విశాలాంధ్ర, సామాజిక ప్రయోజనాన్ని నిబద్ధతతో ఆచరిస్తున్నది. సాంస్కృతిక రంగాన్ని ఎవరూ పట్టించుకోని ఆ రోజులలో వివిధ కళా ప్రక్రియల గురించి పాఠకులకు తెలియజేసిన పత్రిక ఇది. భరత నాట్యం, యక్షగానం, కూచిపూడి, జానపదాలు, మంగళ వాయిద్యాలు, సంగీతం మొదలగు ప్రక్రియల గురించి ఆనాడే పాఠకులకు వివరించింది. తెలుగు ప్రజల సంస్కృతి, సాహిత్యం, కళలకు విశాలాంధ్ర ప్రతిబింబం అంటే అతిశయోక్తి లేదు. తెలుగు జర్నలిజానికి పాఠశాల విశాలాంధ్ర. చంద్రం తుమ్మల, ఏటుకూరి, రాఘవాచారి, పట్టాభి లాంటి వారి చేతుల్లో శిష్యరికం చేసిన ఎంతో మంది జర్నలిజంలో ఓనమాలు దిద్దుకున్నారు. అలాంటి వారు ప్రస్తుతం ఇతర పత్రికలలోకి వెళ్లి గొప్ప జర్నలిస్టులుగా కీర్తినందుకుంటున్నారు. నిబద్దత కలిగిన కొందరు తల్లిలాంటి విశాలాంధ్రలోనే కొనసాగుతూ తల్లిరుణం తీర్చుకుంటున్నారు. ప్రస్తుతకాలంలో పోటీగా పెట్టుబడి పత్రికలు అనేకం వస్తున్నాయి. పాఠకుల అభిరుచులు గమనంలోకి తీసుకోవాలి మనం. మన ఆశయాలకు అనుగుణంగానే ఆకర్షణీయంగా విశాలాంధ్రను మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మార్పు తీసుకురావాలి. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పటికీ ఎంతో అభ్యుదయ భావాలతో పత్రికను నడుపుతూ ముందుకు తీసుకుపోతున్న, పత్రికను నడుపుతున్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img